దేశ భద్రత దృష్ట్యా కేంద్రం స్మార్ట్ ఫోన్ లపై(Smartphones) కీలక నిర్ణయం తీసుకుంది.
టెక్నాలజీ ఉపయోగించి స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి ఎక్కడినుండో వేరే వాళ్ళు ఫోన్లను ఆపరేట్ చేయడం క్రమంగా పెరుగుతూనే పోతుంది.
ప్రజల వ్యక్తిగత భద్రతతో పాటు.దేశ రక్షణకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది.
ఇటీవలే హ్యాకింగ్ ద్వారా డేటా చోరీలు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్లలో ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్స్ కారణమని భావించిన కేంద్రం వాటిని చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.స్మార్ట్ ఫోన్లో ఫ్రీ ఇన్స్టాల్ యాప్స్ ను(free install apps) తొలగిస్తే దేశ రక్షణకు, ప్రజల వ్యక్తిగత రక్షణకు భద్రత ఏర్పడుతుందని భావించి, మొబైల్ కంపెనీ లకు కొత్త ఆదేశాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
స్మార్ట్ ఫోన్లలో ఫ్రీ ఇన్స్టాల్ యాప్ లను తొలగించి, ఆపరేటింగ్ సిస్టం అప్డేట్లను తప్పనిసరి చేసేలా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలకు ఆదేశాలు ఇవ్వనుంది.
మేజర్ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్ ను కచ్చితంగా పరీక్షించేందుకు అవకాశం ఉండేలా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.భారతదేశ మార్కెట్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ కావడంతో ఈ కొత్త ఆదేశాలపై కేంద్రం(central government) వెనకకు తగ్గకపోవడంతో ప్రముఖ కంపెనీలు ప్రస్తుతం షాక్ లో ఉన్నాయి.కొన్ని స్మార్ట్ ఫోన్లలో డిలీట్ చేయడానికి వీలు లేకుండా కంపెనీ యాప్స్ ను ఇన్స్టాల్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
కానీ ఇప్పటినుంచి ఆ యాప్స్ ఆన్ ఇన్స్టాల్ చేసే విధంగా ఒక ఆప్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఇక ఇప్పటికే టిక్ టాక్ (tiktok app)సహా దాదాపు 300 చైనీస్ యాప్స్ ను భారతదేశం నిషేధించింది.
ఇతర దేశాల్లో ఉన్న తమ కంపెనీల ద్వారా చైనా గూడాచారానికి పాల్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో భారత కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ నిర్ణయంతో ఫోన్ల తయారీ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy