చావు అంచుల దాకా వెళ్లి తృటిలో తప్పించుకున్న సినీ సెలబ్రిటీస్.. ఎవరో తెలిస్తే..?

సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలకు కూడా ప్రమాదాలు కష్టాలూ ఎదురవుతుంటాయి .అలాంటి సమయంలో వారు చావు అంచుల దాకా వెళ్లి వస్తుంటారు.

అదృష్టం బాగోలేని వారు చనిపోతారు, అదృష్టం కలిసి వచ్చినవారు మృత్యువు నుంచి ఎలాగోలా బయటపడతారు.అలా చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడిన కొంతమంది లక్కీ సినీ సెలబ్రెటీల గురించి తెలుసుకుందాం.

• అమితాబ్ బచ్చన్:

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) కూలీ (1983) మూవీ సెట్స్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.1982, జులై 26న బెంగుళూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో పునీత్ ఇస్సార్‌తో కలిసి ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది.చిత్రీకరణ సమయంలో, అమితాబ్ తప్పుగా జంప్‌ చేశాడు.

దానివల్ల టేబుల్‌పై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే మూవీ టీమ్‌ ముంబై ఆసుపత్రికి తరలించింది.

అక్కడ అనేక సర్జరీలు చేశారు.అయితే అమితాబ్‌ను వెంటిలేటర్‌పై ఉంచే ముందు కొన్ని నిమిషాల పాటు అతడిని క్లినికల్లీ డెత్‌గా డాక్టర్లు ప్రకటించారు.

Advertisement

ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, లక్షలాది మంది అభిమానులు దేవాలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు, బతకడం కష్టం అనుకున్న అమితాబ్ చివరకు ఆగస్టు 2న స్పృహలోకి వచ్చాడు.

• అజయ్ భూపతి:

ఆర్ఎక్స్ 100( RX 100 ) సినిమాతో ఈ డైరెక్టర్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.రూ.2 కోట్లు పెట్టి తీస్తే ఇది 27 కోట్ల దాకా కలెక్షన్స్ వసూలు చేసింది.ఈ డైరెక్టర్ చాలా టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు.

"మంగళవారం" సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇంత టాలెంట్ పెట్టుకొని ఈ దర్శకుడు ఒక సమయంలో సూసైడ్ చేసుకుందామనుకున్నాడు.

లవ్‌లో ఫెయిల్ అయ్యాక ఇక జీవితంలో బతకడానికి ఏమీ లేదు అనుకుంటూ సూసైడ్ చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.సరిగ్గా అప్పుడే రామ్‌ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేసే ఛాన్స్ దక్కింది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

దాంతో అతను ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

Advertisement

• సాయి ధరమ్ తేజ్

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్( Saidharam Tej ) బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.అయితే అతనికి ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలో ఉన్న వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు.సకాలంలో వైద్యం అందడం వల్ల సాయి ధరమ్‌ తేజ్ మృత్యువు నుంచి బయటపడ్డాడు.

• సుకుమార్

ఆర్య మూవీ షూటింగ్ సమయంలో సుకుమార్( Sukumar ) పొరపాటున నీటిలో పడిపోయారు.దానివల్ల ఇక మరణించడం ఖాయం అనుకొని సుకుమార్ ఆశలు వదిలేసుకున్నాడు.అదే సమయంలో అల్లు అర్జున్ వెంటనే నీటిలోకి దూకి సుకుమార్ ని కాపాడాడు.

తాజా వార్తలు