రైతు రుణ మాఫీ పై విలాసాగర్ లో సంబరాలు - సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలసాగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి=కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో పాల అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆమె ప్రకారం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడం అర్షనీయమని అన్నారు.

అలాగే రెండో విడతలో లక్ష యాభై వేలు మూడో విడతలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఆగస్టు 15 లోపు చేస్తారని అన్నారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రహదారి భద్రత మాసోత్సవ అవగాహన ఫ్లెక్సీ ల ఏర్పాటు..
Advertisement

Latest Rajanna Sircilla News