వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో అతడిని ఏడు గంటల పాటు విచారించిన సీబీఐ..!!

కరోనా కారణంగా కొన్ని నెలలపాటు వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో సీబీఐ విచారణ ఆగిపోయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి.

ఈ కేసు విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో తాజాగా ఇటీవల ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది.దీంతో సిబిఐ బృందాలు కడప జిల్లాలో దిగి.

కేసులో ప్రతి అనుమానితుడిని విచారణ చేస్తూ ఉంది.దీనిలోభాగంగా వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి ని దాదాపు ఏడు గంటల పాటు సిబిఐ విచారించటం సంచలనం రేపుతోంది.

గతంలో కూడా ఆయన్ను నెల రోజుల పాటు ఢిల్లీలో విచారించి తిరిగి కడపకు చేర్చడం జరిగింది.అయితే మళ్లీ ఆయన్ను పిలిచిన అధికారులు సుదీర్ఘంగా విచారించడంతో ఈ వార్త సంచలనం గా మారింది.వివేకానంద రెడ్డి హత్య హత్య కి 6 నెలల ముందు ఉద్యోగం మానేయటం, ఇంకా అనేక విషయాల పై సిబిఐ విచారణ చేసింది.

Advertisement

అదే రీతిలో అతని ఆర్థిక లావాదేవీల గురించి అనేక ప్రశ్నలు వేసినట్లు టాక్.అనంతరం పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య చేయబడిన ప్రాంతం వద్ద మళ్లీ రీ షూట్ చేసి కేసులో ఉన్న అనుమానితులను సీబీఐ విచారణ చేయడం జరిగింది.

  .

Advertisement

తాజా వార్తలు