డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసిన సిబీఐ... కేసులో కొత్త మలుపు

నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.

మాస్క్ లు సమకూర్చలేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో అతనిని విధుల నుంచి తప్పించిన ప్రభుత్వం మీద తరువాత అకస్మాత్తుగా ఒక రోజు నడిరోడ్డు మీద కారు ఆపి మద్యం మత్తులో బూతుపురాణం అందుకున్నాడు.

ఈ సందర్భంగా పోలీసులు కాస్తా అత్యుత్సాహం చూపించి అతనిని తాళ్ళతో బంధించి అరెస్ట్ చేశారు.దానికి సంబందించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకొని ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది.

దళిత కార్డు ఉపయోగించి రాజకీయాలు ఆపాదించి రెచ్చగొట్టింది.దీంతో ఈ సుధాకర్ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే ఈ కేసుని హైకోర్టు సుమోటోగా తీసుకొని ఎవరూ ఊహించని విధంగా సిబీఐ ఎంక్వయిరీకి ఆదేశించింది.ఈ కేసుపై సిబీఐ విచారణ మొదలుపెట్టింది.

Advertisement

అతనిని అరెస్ట్ చేసిన పోలీసుల నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్స్ వరకు అందరిని ప్రశ్నించింది.ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

హైకోర్టు ఆదేశాలతో సుధాకర్‌ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు ఇప్పటి వరకు పోలీసులపై కేసు నమోదు చేయగా, తాజాగా డాక్టర్‌ సుధాకర్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.ఓ ప్రభుత్వ ఉద్యోగి అయివుండి ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా అసభ్యకరంగా ప్రవర్తించడం, ఓ కానిస్టేబుల్‌ మొబైల్‌ను కిందపడేయడం, స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది.

అంతేకాదు 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు.వీటన్నింటిని పరిశీలించిన మీదట డాక్టర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసింది.

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు సెక్షన్‌ 188 నమోదైంది.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు