కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

వేగంగా వస్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.అప్రమత్తమైన డ్రైవర్ కారులో ఉన్న ప్రయాణికులకు అలర్ట్ చేశాడు.

అందరూ కిందికి దిగడంతో ప్రమాదం తృటిలో తప్పింది.ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ పోలీసులు మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు.

విశాఖలో పెను ప్రమాదం సంభవించింది.గోపాలపట్నం పెట్రోల్ బంక్ కూడలికి దగ్గర్లో ఉన్న కుమారి కళ్యాణ మండపం దగ్గర నడిరోడ్డుపై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

నడుస్తున్న కారులో కాలుతున్న వాసన రావడంతో కారును రోడ్డుపై ఆపి అందరిని కారులో నుంచి కిందికి దింపాడు డ్రైవర్.కారులో నుంచి ప్యాసింజర్లు దిగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Advertisement

డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది.అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

ఎయిర్ పోర్ట్ నుంచి సింహాచలం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.తనతో పాటు నలుగురు ప్రయాణికులు కారులో ఉన్నారని డ్రైవర్ పేర్కొన్నాడు.

ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు మాత్రం పూర్తిగా దగ్ధం అయిందన్నాడు.ఈ మేరకు కారులో మంటలు రావడానికి గల కారణాలను తెలియాల్సి ఉందన్నాడు.

అయితే కారు ఇంజిన్ మంటలు వచ్చి ప్రమాదం జరిగి ఉంటుందని డ్రైవర్ పేర్కొన్నాడు.ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు