హైదరాబాద్‎లోని హబ్సిగూడలో కారు బీభత్సం

హైదరాబాద్‎లోని హబ్సిగూడలో కారు బీభత్సం సృష్టించింది.ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

మద్యం మత్తులో కొందరు యువకులు కారును నడిపినట్లు అనుమానం.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

వెంటనే స్పందిచిన స్థానికులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.వీరిలో ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఘటనపై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా

తాజా వార్తలు