Rajesh Kannoji Rahul : రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న టీచర్ కి ఊహించని షాక్ ఇచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” పాదయాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో జరుగుతుంది.ప్రజలను కలుపుకుంటూ పోతూ రాహుల్ ప్రతి ఒక్కరి సమస్యలు వింటూ ఉన్నారు.

 Madhya Pradesh Government Gave An Unexpected Shock To The Teacher Who Participat-TeluguStop.com

ప్రజల నుండి మంచి స్పందన వస్తూ ఉండటంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది.దీంతో పార్లమెంట్ సమావేశాలకు కూడా వెళ్లకుండా ఇప్పుడు రాహుల్ పాదయాత్ర చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఇదిలా ఉంటే రాహుల్ మధ్యప్రదేశ్ పాదయాత్రలో భాగంగా రాహుల్ తో కలిసి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కలసి అడుగులు వేయడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి ఊహించని షాక్ ఇచ్చింది.

సర్వీస్ కండక్ట్ రూల్స్ అతిక్రమించాడనే ఆరోపణలతో విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసి వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ప్రైమరీ పాఠశాలలో రాజేష్ కన్నోజి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.

రాజేష్ సెలవు పెట్టి మరి ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది.నవంబర్ 24 వ తారీకు సెలవు పెట్టి తాను వేసిన పెయింటింగ్స్ అన్నిటిని కూడా రాహుల్ గాంధీకి బహుకరించారు.

Telugu Congress, Rahul Gandhi-Telugu Political News

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో ఫోటోలు వైరల్ కావడంతో విషయం విద్యాశాఖ ఉన్నత అధికారుల దృష్టిదాక వెళ్లడం జరిగింది.దీంతో రాజేష్ నీ ప్రొఫెషనల్ కండక్ట్ రూల్స్ అతిక్రమించారని నోటీసులు జారీ చేసి ఆ తర్వాత.విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube