క్యాన్స‌ర్‌కు దూరంగా ఉండాలంటే.. ఖ‌చ్చితంగా ఇవి పాటించాల్సిందే!

క్యాన్స‌ర్.ఈ పేరు వింటేనే వెన్నులో వ‌ణుకు పుడుతుంది.

ప్రాణాంత‌క‌మైన ఈ క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి ప్ర‌తి సంవ‌త్స‌రం కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంటోంది.

సైలెంట్‌గా ఎటాక్ చేసే ఈ క్యాన్స‌ర్‌.

చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎంద‌రినో క‌బ‌లిస్తోంది.క్యాన్స‌ర్‌కు ట్రీట్‌మెంట్ ఉన్న‌ప్ప‌టికీ.

చివ‌రి ద‌శ వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్లే చాలా మంది మృతి చెందుతున్నారు.అందువ‌ల్లే, ఈ క్యాన్స‌ర్ రాకుండా ముందుగానే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అయితే క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారికి దూరంగా ఉండాలంటే.ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు ఖ‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

విట‌మిన్ డి.క్యాన్స‌ర్‌కు చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, ప్రొటెస్ట్ క్యాన్స‌ర్‌, కోలన్ క్యాన్స‌ర్, ‌స్టమక్ క్యాన్సర్‌, స్కిన్ క్యాన్సర్ల నుంచి ర‌క్షించ‌డంలో విట‌మిన్ డి ఉప‌యోగ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఉద‌యం ఎండ‌లో క‌నీసం పావు గంట నుంచి ఇవ‌వై నిమిషాలు నిల‌బ‌డితే.విట‌మిన్ డి ల‌భిస్తుంది.

అలాగే నేటి అధునిక కాలంలో చాలా మంది నిద్ర‌కు దూరం అవుతున్నారు.అయితే వ‌స్తావానికి తొబై శాతం జ‌బ్బుల‌ను త‌గ్గించ‌డంలో నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది.అందువ‌ల్ల, నిద్ర‌ను ఎప్పుడూ స్కిప్ చేయ‌కూడ‌దు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ప్ర‌తి రోజు సరైన నిద్ర పోతోనే క్యాన్స‌ర్ స‌మ‌స్య‌కు కూడా దూరంగా ఉండ‌గ‌లం.ఇక వ్యాయామం త‌ప్ప‌కుండా చేయాలి.

Advertisement

రెగ్యుల‌ర్‌గా కాక‌పోయినా.వారంలో ఆరు రోజులైనా వ్యాయామం చేస్తే.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డి క్యాన్స‌ర్ స‌మ‌స్య దరిచేర‌కుండా ఉంటుంది.అలాగే ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

ప్ర‌తి రోజు ఎక్కువ నీరును సేవించాలి.ఇక వీటితో పాటు డైలీ డైట్‌లో కూడా ప‌లు మార్పులు చేసుకోవాలి.

అల్లం, వెల్లుల్లి, బ్రకోలి, పాలకూర, స్వీట్ పొటాటో, ఉల్లిపాయలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, నారింత‌, యాపిల్‌, గ్రీన్ టీ, సాల్మ‌న్‌ ఫిష్‌, ప‌సుపు వంటివి ఖ‌చ్చితంగా తీసుకోవాలి.ఈ ఆహారాలు క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా అడ్డుక‌ట్ట‌వేయంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

తాజా వార్తలు