ప్రతి కేసును విశ్లేషిస్తాం .. భారతీయ విద్యార్ధుల బహిష్కరణపై కెనడా ప్రధాని ట్రూడో స్పందన

నకిలీ పత్రాలతో అడ్మిషన్లు పొందిన 700 మంది భారతీయ విద్యార్ధులను బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్ధుల తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తోంది.

తమకు న్యాయం చేయాలంటూ వారు ఇరుదేశాల ప్రభుత్వాలను కోరుతున్నారు.

బాధిత విద్యార్ధుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే కావడంతో అక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం ఏకతాటిపైకి వచ్చాయి.విద్యార్ధుల బహిష్కరణ విషయంలో జోక్యం చేసుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ ఎంపీ , మాజీ కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్‌( Kuldeep Singh Dhaliwal )లు కేంద్రానికి లేఖలు రాశారు.

వివాదం పెద్దదవుతున్న నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) స్పందించారు.విద్యార్ధుల దరఖాస్తులను మరోసారి స్క్రూట్నీ చేస్తామని, మోసానికి గురైన బాధితులు ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించాలని ట్రూడో కోరారు.భారత్‌లోని ఇమ్మిగ్రేషన్ కన్సల్టేషన్ ఏజెన్సీ ఇచ్చిన నకిలీ పత్రాలతో తాము మోసపోయామని వందలాది మంది భారతీయ విద్యార్ధులు వాపోతున్నారు.

Advertisement

అటు భారతీయ విద్యార్ధుల బహిష్కరణ వ్యవహారం కెనడా పార్లమెంట్‌ను కుదిపేసింది.దీనిపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని ట్రూడో మాట్లాడుతూ.బాధితులకు జరిమానా విధించకుండా దోషులను గుర్తించడంపై తాము ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.

అంతర్జాతీయ విద్యార్ధులు మనదేశానికి అందించే అపారమైన సహకారాన్ని తాము గుర్తించామన్నారు.ప్రతి కేసును విశ్లేషించి.

బాధితులకు మద్ధతు ఇవ్వడానికి తాము కట్టుబడి వున్నామన్నారు.

మరోవైపు .సిక్కు సంతతికి చెందిన ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) సైతం విద్యార్ధుల బహిష్కరణపై ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్ధుల బహిష్కరణ ఉత్తర్వులను రద్దు చేయడానికి గాను ఆయన పార్లమెంట్‌లో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కాగా.కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ప్రకారం నకిలీ ఆఫర్ లెటర్స్‌తో అడ్మిషన్లు సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.

Advertisement

ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.

తాజా వార్తలు