అమెరికా కార్మికుల కోసం సెనేట్ లో కీలక బిల్లు...!

డెమోక్రాటిక్ పార్టీకి చెందినా సెనేటర్ లోరేనా గోంజ అనే నేత కార్మికులు కూడా కాంట్రాక్టర్ల స్థాయికి ఎదగాలని అప్పుడే నిజమైన అభివృద్ధి, పాలన జరిగినట్టని తెలిపారు.

ఈ మేరకు సెనేట్ లో కీలక బిల్లుకూడా ప్రవేశపెట్టారు.

కార్మికుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.పలు రంగాలలో పని చేస్తున్న కార్మికులు ఎన్నో వివక్షలు ఎదుర్కుంటున్నారు అంటూ ఆయన వాపోయారు.

  తక్కువ వేతనాలతో అధికంగా పనిచేస్తున్నారని అంతేకాకుండా వారి హక్కులకి తీవ్ర భంగం వాటిల్లుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కారణంతోనే తానూ ప్రతిపాదించిన ఓ బిల్లుకి సెనేట్ లో ప్రవేశ పెట్టగానే ఆమోదం లభించిందని ఆయన తెలిపారు.ఈ బిలుకి సుమారు 29 మంది సెనేటర్లు మద్దతు ఇవ్వగా 11 మంది వ్యతిరేకించారని ఆయన మండిపడ్డారు.

ఉబర్‌ టెక్నాలజీస్‌ ఐఎన్‌సీ, లిఫ్ట్‌ ఐఎన్‌సీ తదితర కంపెనీలలో పని చేస్తున్న వారు దయనీయమైన పరిస్థితులు ఎదుర్కుంటున్నారని ఆయన తెలిపారు.

Advertisement

  ఈ కీలక బిలుకి అధికార ప్రతినిధులు అందరూ ఆమోదం తెలిపారని.ఈ బిల్లుకి మద్దతుగా వేలాది మంది పౌరులు ట్వీట్ లు చేశారని ఆయన అన్నారు.అయితే నాన్ కరెంట్ బిల్లుని ఓటింగ్ కోసం అసెంబ్లీ కి పంపుతారని అన్నారు.

కాగా తక్కువ వేతనం తీసుకుంటూ అధిక సమయం పని చేసే వారికి త్వరలోనే ఊరట కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు