నాగచైతన్యకు జోడీగా జూనియర్ ఎన్టీఆర్ బ్యూటీ.. ఈ ఛాన్స్ తో దశ తిరిగినట్టేనా?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇటీవలే దేవర( Devara ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

మొదటి మూవీతోనే మంచి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాతో భారీగా గుర్తింపును తెచ్చుకుంది.

ఇకపోతే జాన్వీ తన తదుపరి సినిమాలో రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాటు ఇప్పుడు మరొక సినిమాలో కూడా నటించబోతోంది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్.

Advertisement

త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని నాగచైతన్య గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత ఒక సింపుల్ లవ్ స్టోరీలో నటించాలని చైతూ భావిస్తున్నాడట.దీనికోసం దర్శకుడు శివ నిర్వాణ( Director Shiva Nirvana ) ఇప్పటికే ఒక కథను కూడా సిద్ధం చేశాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని సెలెక్ట్ చేయాలని శివ నిర్వాణ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో చైతూతో కలిసి శివ నిర్వాణ మజిలీ వంటి బ్లాక్‌ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

దీంతో ఈ కాంబినేషన్‌లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ సర్కిల్స్‌ లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మరి ఈ వార్తలపై పూర్తి సమాచారం తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.అయితే రామ్ చరణ్ సినిమా మొదలు పెట్టిన తర్వాత ఈ సినిమా మొదలవుతుందా లేదంటే అంతకంటే ముందుగానే ఈ సినిమాను మొదలు పెడతారా అన్నది చూడాలి మరి.మరి జాన్వి కపూర్ కి మొదట ఏ ఏ సినిమాలో నటిస్తుందో చూడాలి మరి.

సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?
Advertisement

తాజా వార్తలు