Bhagwant Kesari : భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఆరోజు బాలయ్య ఫ్యాన్స్ కు పండగేనా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Natasinham Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు బాలయ్య బాబు.ఇకపోతే ఇటీవల బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక బాలయ్య బాబు తాజాగా నటించిన భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari movie ) త్వరలోనే విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.కాగా ఈ మూవీకి అనిల్ రావిపూడి ( Anil Ravipudi )దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.దగ్గర పడుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి.

Advertisement

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బాలయ్య బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో శ్రీ లీల కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

అలాగే అర్జున్ రాంపాల్( Arjun Rampal ) విలన్‌ గా నటించడంతోపాటు ఈ సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెడుతున్నాడు.ఈ సినిమాలో తండ్రి ,కూతురు మధ్య ఒక ఎమోషనల్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది.ఇకపోతే మరొకవైపు ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదు.దీంతో ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు