మంగళవారం కొత్త బట్టలు కొంటే ఏం అవుతుందో తెలుసా?

మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు.మంగళవారం స్వామివారికి దర్శించుకోవడం వల్ల ఎంతో శక్తిని ప్రసాదిస్తాడు.

ఎంతటి సమస్యనైనా జయించగలగే బలాన్ని ప్రసాదిస్తాడు.ఆంజనేయ స్తోత్రం పఠించడం వల్ల ఎలాంటి పీడకలలు రాకుండా, భయబ్రాంతులకు లోనవ్వకుండా మనోధైర్యంతో ఉంటారు.

Buying New Clothes On Tuesday, Tuesday, Anjaneya Swami, New Clothes, Bad Dreams,

అయితే మంగళవారం కొన్ని పనులు చేయకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.ముఖ్యంగా మంగళవారం కొత్త బట్టలనుకొన్న, ధరించిన మనకు కీడు జరుగుతుందని చెబుతుంటారు.

మంగళవారం కొత్త బట్టలు ధరించడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.వారంలో మూడో రోజైన మంగళ వారానికి కుజుడు అధిపతి.

Advertisement

కుజుడు కోపానికి, పాపాలకు, ప్రమాదాలకు ప్రతీక అని అంటారు.అలాంటి మంగళవారం రోజున ఎటువంటి శుభకార్యాలు తలపెట్టిన అవి ఏదో ఒక కారణం చేత ఆగిపోతాయి.

అంతేకాకుండా మంగళవారం ప్రయాణాలు చేయకూడదు.ఒకవేళ ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు సంభవించవచ్చు.

మంగళవారం కొత్త బట్టలను ధరించకూడదు అని చెబుతారు.అలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నిక రాకుండా ఉండటమే కాకుండాఅవి ధరించి ఎటువంటి శుభకార్యాలు తలపెట్టిన అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మంగళవారం కుజునికి చెందిన రోజు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.మంగళవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అలాగే ఏదైనా అవసరం నిమిత్తం ఒకరి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు.ఒకవేళ తీసుకున్నా అది అవసరానికి కాకుండా, వృథా ఖర్చులకు అయిపోతుంది.

Advertisement

మంగళవారం ఆంజనేయ స్వామికి తమలపాకు మాలలు వేసి ఎర్రని సింధూరంతో పూజించడంవల్ల మనకు అత్యంత శక్తిని కలిగిస్తాడు.ఎర్రని మందారాలు అంటే ఆంజనేయ స్వామి కి ఎంతో ఇష్టం వాటితో పూజ చేయడంవల్ల స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది.

మంగళవారం రోజున మహిళలు ఎర్రటి పువ్వులు పెట్టుకోవడం, ఎర్రటి తిలకాన్ని నుదుటన పెట్టుకోవడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తి కలుగుతుంది.

తాజా వార్తలు