వినాయకుడి విగ్రహాలు ద్వంసం.. వీడియో వైరల్!

మరో వారంలో వినాయకచవితి.అందుకే ఎన్నో చోట్లా మట్టి వినాయకుడు విగ్రహాన్నీ చేస్తారు.

ఇంకా అలానే మనం ఎంతో గౌరవించే వినాయక విగ్రహాలను అమ్మెందుకు షాపింగ్ మాల్‌లో పెట్టారు.అయితే అలా ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహాలను ఓ మహిళ నేలకేసి కొట్టి ద్వంసం చేసింది.

ఈ ఘటన బహ్రెయిన్‌ రాజధాని మనామాలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బుర్ఖా ధరించిన ఓ మహిళ షాపింగ్ చేస్తుండగా.ఇది ముస్లిం దేశం.ఇది మహ్మద్ బెన్ ఇస్సాకు చెందిన దేశం.

Advertisement

ఈ దేశం ఇలాంటివి అనుమతిస్తారా ? అంటూ ఆమె విగ్రహాలను తీసి నేలకేసి కొట్టింది.ఈ విగ్రహాలను ఎవరు పూజిస్తారో చూస్తా.

పోలీసులను పిలుచుకో అంటూ మరో మహిళ ఆ మాల్ సిబ్బందితో అనడం ఆ వీడియోలో కనిపిస్తుంది.ఈ వీడియోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.విగ్రహాలను ద్వంసం చేసిన మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

ఈ మేరకు బహ్రెయిన్ ప్రభుత్వం ట్విట్ చేసింది.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు