అలా చేయగల ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ మాత్రమే.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు( Bunny Vas ) తాజాగా అల్లు అర్జున్( Allu Arjun ) గురించి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆయ్ సినిమా( Aay Movie ) ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ అల్లు అర్జున్ తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ బాగోద్వేగానికి లోనయ్యారు.

కాగా ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ మందుంటారు.

వారిలో ఒకరు మా అమ్మ.రెండో వ్యక్తి నా స్నేహితుడు అల్లు అర్జున్‌.

ఆయ్‌ సినిమా ప్రచారం సరిగ్గా జరగడం లేదని బన్నీని పోస్ట్‌ పెట్టమని అడగాలని మా టీమ్‌ వాళ్లు కోరారు.

Bunny Vasu About Allu Arjun In Aay Pre Release Event, Bunny Vasu, Allu Arjun, To
Advertisement
Bunny Vasu About Allu Arjun In Aay Pre Release Event, Bunny Vasu, Allu Arjun, To

కానీ, నేను ఆయన్ను అడగలేదు.నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ఎక్స్‌లో ఈ చిత్రం గురించి పోస్ట్‌ చేశారు.నాకు అవసరం ఉన్న ప్రతిసారి ఆయన ముందుండి నడిపిస్తారు.ఒక స్నేహితుడికి కష్టమొస్తే తనకు ఎలా సపోర్ట్‌ చేయాలని తెలిసిన ఏకైక వ్యక్తి నా దృష్టిలో అల్లు అర్జునే.20 ఏళ్ల క్రితం నేను గీతా ఆర్ట్స్‌( Geetha Arts ) నుంచి వెళ్లిపోవాల్సిన సంఘటన ఎదురైంది.ఆ రోజు బన్నీ నాకు సపోర్ట్‌ చేయడం కోసం వాళ్ల నాన్నను కూడా ఎదిరించారు.

అప్పుడు ఆయన సపోర్ట్‌ చేయకపోతే ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు.తన స్నేహితుల్లో ఎవరికి అవసరం వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బన్నీ సపోర్ట్‌ చేస్తాడు.

Bunny Vasu About Allu Arjun In Aay Pre Release Event, Bunny Vasu, Allu Arjun, To

అలాంటి మంచి వ్యక్తి అల్లు అర్జున్ అంటూ తమ స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా బన్నీ వాసు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇది ఐకాన్ స్టార్( Icon Star ) అంటే అంటూ కామెంట్ల చేస్తున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే.బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

కాగా ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు