బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన వధువుకు సినిమా అవకాశం!

ఈమధ్య కాలంలో ట్రెండ్ బాగా నడుస్తుంది.ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.

ఇక పెళ్లిళ్ల విషయంలో మాత్రం ఫోటో షూట్ లు, వెడ్డింగ్ డాన్స్ లని బాగా చేస్తున్నారు.అలా ఇప్పటికి ఎంతో మంది జంటలు ప్రీ వెడ్డింగ్ వీడియోస్ అంటూ బాగా సందడి చేస్తున్నారు.

వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటున్నారు.ఇదిలా ఉంటే కొన్ని రోజుల కిందట యూట్యూబ్ లో బుల్లెట్ బండి అనే పాట ఎంతలా వైరల్ గా మారిందో చూశాం.

ఇక ఈ పాట తో ఎంతో మంది డాన్సర్లు తెగ డాన్సులు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.ఇదిలా ఉంటే గత వారం నుండి ఈ పాటతో ఓ పెళ్లి కూతురు డాన్స్ చేసిన వీడియో బాగా వైరల్ గా మారింది.

Advertisement

ఇప్పటికీ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గానే ఉంది.అంతే కాకుండా విపరీతమైన లైకులు కూడా వచ్చాయి.

మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ ఎస్ ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రీయ ను రామకృష్ణాపూర్ కి చెందిన ఆకుల అశోక్ తో ఈనెల 14న పెళ్లి జరిపించారు.ఇక సాయి శ్రీ తన భర్తకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకోని భరత్ సమయంలో బుల్లెట్ బండికి డాన్స్ చేసింది.దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా అందరినీ ఫిదా చేసింది ఈ పెళ్లి కూతురు.

దీంతో ఈ పాటను తెరకెక్కించిన బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్వాహకుడు నిరూప.పెళ్లికూతురు సాయిశ్రీయ కు ఫోన్ చేసి ఓ అవకాశం ఇచ్చాడట.తమ సంస్థలో నిర్మించే తర్వాత పాటకు తనను నటించాలని కోరాడట.

దీంతో సాయి శ్రీయ కూడా వెంటనే ఓకే చెప్పిందట.కేవలం ఒక డాన్స్ తోనే మంచి అవకాశం అందుకుందని నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోనియా వస్తారో లేదో ? నేడు ఢిల్లీకి రేవంత్ 
Advertisement

తాజా వార్తలు