రెండు తలలతో పుట్టిన దూడ..చూసేందుకు ఎగబడుతున్న జనం!

ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏదొక వింతలు జరుగుతూనే ఉంటాయి.వాటిని మనం ఇంట్లో కూర్చునే చూస్తున్నాం.

టెక్నాలిజీ పెరగడం వల్ల ఈ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏమి జరిగినా యిట్టె తెలిసి పోతుంది.ప్రతిదీ ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం నేటి యువతకు అలవాటుగా మారిపోయింది.

అలాంటివి తరచు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికీ తరచు ఏదొక ఆశ్చర్యం కలిగించే విషయాలు వీడియోల రూపములో కానీ ఫోటోల రూపంలో కానీ కనిపిస్తూనే ఉంటాయి.

అయితే తాజాగా ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.భూమి మీద ఏ ప్రాణికయినా ఒకటే తల ఉంటుంది.

Advertisement

ఇది అందరికి తెలిసిన విషయమే.కానీ అప్పుడప్పుడు కొన్ని ప్రాణులు రెండు తలలతో పుడతాయి.

వాటిని చుస్తే మనం ఆశ్చర్య పోవడం ఖాయం.అయితే ఇందులో వింత ఏమి లేదని అవి కేవలం జన్యు లోపాలతో అలా పుడుతాయని వైద్యులు చెబుతూనే ఉంటారు.

అయితే ఇలా జన్యు లోపాలతో పుట్టే ప్రాణులు బ్రతకడం కష్టమే.ఎక్కడో ఒక చోట మాత్రమే ఇలా పుట్టిన ప్రాణులు జీవిస్తాయి.తాజాగా ఇలాంటి అరుదైన ఘటన ప్రకాశం జిల్లాలోని జేసీ అగ్రహారం అనే గ్రామంలో జరిగింది.

ఈ గ్రామంలో ఉండే ఒక రైతు గేదె నిన్న ఈనింది.ఐతే పుట్టిన దూడ మాత్రం అన్నిటిలా కాకుండా రెండు తలలతో జన్మించింది.ఆ రెండు తలలకు కూడా అన్ని అవయవాలు ఉన్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అయితే ఆ దూడ మాత్రం ఎక్కువ సేపు ప్రాణాలతో లేదు.పుట్టిన గంటలోపే దూడ చనిపోవడంతో ఆ రైతు కుటుంబం బాధను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ చనిపోయిన దూడను చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా తరలి వస్తున్నారు.

తాజా వార్తలు