బాలయ్య చిత్రానికి కోత పెడుతున్నారట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలవడంతో ఈసారి ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉన్నారు బాలయ్య మరియు బోయపాటి.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు బోయపాటి రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడటంతో, ఇప్పుడు అన్ని అంశాల్లో ఈ సినిమా బడ్జెట్‌ను తగ్గించాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.

కాగా ఈ సినిమాను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్‌లో నటిస్తుండగా, అందులో అఘోరా పాత్ర కోసం వారణాసిలో షూటింగ్ నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది.

Advertisement

కానీ ఇప్పుడు బడ్జెట్ తగ్గించడంతో వారణాసిలో ప్లాన్ చేసిన షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది.ఇలా బాలయ్య చిత్రానికి బడ్జెట్ విషయంలో కోత పెట్టిన చిత్ర యూనిట్, వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారా అనే అంశంపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే.మరి ఈ సినిమాను ఎంత బడ్జెట్‌లో పూర్తి చేస్తారా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు