రేపు బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) అధ్యక్షతన రేపు పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది.ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తొలిసారి రాష్ట్రస్థాయిలో భేటీ నిర్వహిస్తుంది.

ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ( Parliamentary Constituency ) అభ్యర్థులకు ఆయన బీ-ఫారాలను అందించనున్నారు.ఎన్నికల నియమావళిని అనుసరించి అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కును ఒక్కో అభ్యర్థికి అందించనున్నారని తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని యోచనలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారం.ఈ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై కూడా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు.

Advertisement
గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)

తాజా వార్తలు