బ్రేకింగ్ : మహేష్ బాబుకి కరోనా పాజిటివ్..!

కరోనా మళ్లీ పడగవిప్పుతుంది.దేశంలో మళ్లీ రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీస్ కు కరోనా పాజిటివ్ రాగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. కొద్దిపాటి సింటమ్స్ ఉండటం వల్ల టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది.

ఇదే విషయాన్ని మహేష్ తన అఫీషియల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ల ద్వారా వెల్లడించారు.తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.

అందరు జాగ్రత్తగా ఉండాలని రెండు డోస్ ల వ్యాక్సిన్ లు పూర్తి చేసుకోని వారు వెంటనే వేయించుకోవాలని చెప్పారు కోవిడ్ నామ్స్ పాటిస్తూ.సేఫ్ గా ఉండండి మళ్లీ త్వరగానే మాములు పరిస్థితికి వస్తానని అన్నారు మహేష్.

Advertisement

మహేష్ కి కరోనా అని తెలియగానే ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది.ప్రస్తుతం మహేష్ మోకాలి చికిత్స కోసం ఫారిన్ వెళ్లారు.

అక్కడ నుండి దుబాయ్ లో స్టే చేస్తున్నారు.ఈమధ్యనే త్రివిక్రం తో కలిసి తన సినిమా ఎనౌన్స్ చేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి బుర్జ్ ఖలీగా దగ్గర ఫోటో దిగారు మహేష్.సో మహేష్ తో పాటు ఫ్యామిలీ మొత్తం ఐసోలేషన్ లో ఉన్నదని చెప్పొచ్చు.

మహేష్ కు కరోనా అని తెలియగానే టాలీవుడ్ షాక్ అయ్యింది.మహేష్ కి వెంటనే కోవిడ్ తగ్గాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు