16 ఏళ్ల బాలికతో 65 ఏళ్ల మేయర్ పెళ్లి.. ఆపై అత్తకు పెద్ద పదవి..

బ్రెజిల్​లో( Brazil ) 65 ఏళ్ల వయసున్న ఒక నగర మేయర్​ 16 ఏళ్ల బాలికను ఇటీవల పెళ్లి చేసుకున్నారు.

ఆ మేయర్‌కి అమ్మాయి కంటే దాదాపు 50 ఏళ్ల ఎక్కువ వయసు ఉంది.

ఈ జంట మధ్య ఇంత వయో వ్యత్యాసం ఉండటంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.అంతేకాదు, ఈ మేయర్( Brazilian Mayor ) తన అత్తగారికి, అంటే అమ్మాయి తల్లికి సాంస్కృతిక, పర్యటక శాఖ కార్యదర్శి పదవిని అందజేశారు.

తాజాగా ఈ విషయం వెలుగులోకి రాగా ఈ వ్యవహారం చర్చినీయాంశమయ్యింది.

Brazilian Mayor Married 16 Year Old Girl And Offered Her Mother Top Job Details,

వివరాల్లోకి వెళితే.దక్షిణ బ్రెజిల్​లోని అరౌకారియా నగరానికి హిస్సామ్​ హుస్సేన్​ దేహైని( Hissam Hussein Dehaini ) అనే 65 ఏళ్ల వ్యక్తి మేయర్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.అయితే ఇంతకుముందు వరకు అతని గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు కానీ 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతడి పేరు దేశమంతటా మార్మోగింది.

Advertisement
Brazilian Mayor Married 16 Year Old Girl And Offered Her Mother Top Job Details,

ఈ పెళ్లితో అతడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు.పెళ్లి చేసుకోవడం మాట అటుంచితే తల్లికి పదోన్నతి ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది.అవినీతి, బంధుప్రీతికి సదరు మేయర్ పాల్పడ్డాడని చాలామంది ఫైర్ అవుతున్నారు.

పరిస్థితి మరింత సీరియస్‌గా మారినందున ఈ ఘటనపై విచారణ సంస్థలు దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి.

Brazilian Mayor Married 16 Year Old Girl And Offered Her Mother Top Job Details,

మనదేశంలో పెళ్లి కావాలంటే అమ్మాయికి 21 ఏళ్లు నిండి ఉండాలి.కానీ బ్రెజిల్​ చట్టాల ప్రకారం 16 ఏళ్ల నిండిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు.కాకపోతే తల్లిదండ్రుల అనుమతి పొందాల్సి ఉంటుంది.

కాగా అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరుసటి రోజే హుస్సేన్​ పెళ్లి చేసుకున్నారు.ఇక ఆ బాలిక తల్లి విద్యా శాఖలో ఉద్యోగం చేసేది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
బాన పొట్టను 20 రోజుల్లో ఫ్లాట్ గా మార్చే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!

అయితే తక్కువ శాలరీ వస్తుందని, హోదా కూడా పెద్దది కాకపోవడంతో ఆమె మేయర్‌ని ఉన్నత పదోన్నతి కోసం అడిగింది.అందుకు పిల్లను ఇచ్చి పెళ్లి చేయాలని అతడు షరతు పెట్టాడేమో.

Advertisement

అందుకే ఆమె ముసలోడు అని కూడా చూడకుండా తన పిల్లనిచ్చి పెళ్లి చేసింది.కాగా ఈ విషయం బయటపడటంతో ప్రస్తుతం తల్లితో పాటు ఆ మేయర్‌ని కూడా ప్రజలు, అధికారులు తిట్టిపోస్తున్నారు.

తాజా వార్తలు