పొలార్డ్ కాళ్లకు మొక్కిన బ్రావో.. అవాక్కయిన ఫ్యాన్స్.. వీడియో వైరల్!

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న ఓ మ్యాచ్ జరిగింది.

నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక ఆసక్తికర సన్నివేశం వెలుగుచూసింది.

ముంబై స్టార్ ప్లేయర్, ఆల్ రౌండ‌ర్ కీర‌న్ పొలార్డ్ కాళ్లకు సీఎస్‌కే ప్లేయర్ డ్వేన్ బ్రావో మొక్కాడు.బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు పొలార్డ్ వెళ్తున్నప్పుడు డ్వేన్ బ్రావో అతని వద్దకు వచ్చాడు.

అనంతరం నేలపై మోకాళ్లపై కూర్చుని పొలార్డ్ కాళ్లకు దండం పెట్టాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో పొలార్డ్ కు పాదాభివందనం చేయడం చూడొచ్చు.అయితే బ్రావో ఇలా చేయగానే పొలార్డ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Advertisement

ఆ తర్వాత బ్రావోని లేపి ప్రేమగా హాగ్ చేసుకున్నాడు.ఈ సమయంలో వీరిద్దరూ సంతోషంగా నవ్వుతూ కనిపించారు.

ఈ దృశ్యాలను చూసి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

నిజానికి బ్రావో పొలార్డ్ చాలా ఏళ్ల పాటు వెస్టిండీస్ జ‌ట్టు తరఫున ఎన్నో మ్యాచ్ లు ఆడారు.ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.అయితే పొలార్డ్ ఇటీవల సడన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.

దీంతో తోటి క్రికెటర్లతో పాటు అభిమానులు అందరూ షాక్ అయ్యారు.ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో సీఎస్‌కే టీమ్ గెలిచింది.

పోలీస్‌కే చుక్కలు చూపించిన దున్నపోతు.. అతను ఏం చేశారో చూస్తే..??
Advertisement

తాజా వార్తలు