త్వరలో టాలీవుడ్ లో డెబ్యూ చేయబోతున్న బాలీవుడ్ హీరోయిన్స్

టాలీవుడ్ పాన్ ఇండియ‌న్ సినిమాల‌తో బాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు తెలుగు ద‌ర్శ‌కులు.అంతేకాదు.

మ‌న హీరోలు, హీరోయిన్లు బాలీవుడ్ లో మంచి అవ‌కాశాలు పొందుతున్నారు.తెలుగు సినిమా రేంజి పెర‌గ‌డంతో బాలీవుడ్ బ్యూటిఫుల్ లేడీస్ ఇక్క‌డ అడుగు పెడుతున్నారు.

డైరెక్టుగా తెలుగు సినిమాలు చేస్తున్నారు.దీపికా ప‌దుకొనే నుంచి అలియా భ‌ట్ వ‌ర‌కు తెలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు.

ఇంత‌కీ ప్ర‌స్తుతం తెలుగు ప్రాజెక్టులు చేస్తున్న హిందీ హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపికా ప‌దుకొనే

Advertisement

సౌత్ హీరో అయిన ఉపేంద్ర‌తో తొలి సినిమా చేసిన దీపికా.ఆ మ‌ధ్య‌లో ర‌జ‌నీతో మాత్ర‌మే న‌టించింది.చాలా సంవ‌త్స‌రాల తర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా సినిమాలో దీపికా హీరోయిన్ గా చేస్తుంది.

అలియా భ‌ట్

త‌న చ‌క్క‌టి అందంతో పాటు న‌ట‌న‌తో ఆక‌ట్టుకునే అలియా భ‌ట్.రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది.

జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్

క్రిష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమాలో ఒక హీరోయిన్ పాత్ర‌కు జాక్వ‌లిన్ సెలెక్ట్ అయ్యింద‌ట‌.ఇప్ప‌టికే సాహో సినిమాలో చేసిన ఈభామ ఇందులో పూర్తి స్థాయి పాత్ర చేస్తుంద‌ట‌.

అన‌న్య పాండే

మాస్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్, విడి లింగ‌ర్ కాంబోలో వ‌స్తున్న సినిమాలో అన‌న్య పాండే టాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తోంది.

దియా మీర్జా

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

నాగార్జున హీరోగా చేసిన వైల్డ్ డాగ్ సినిమాతో దియా మీర్జా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది.

స‌యి మంజురేక‌ర్

Advertisement

వ‌రుణ్ తేజ్ ఘ‌ని, అడ‌వి శేషు మేజ‌ర్ సినిమాల్లో ఈ బాలీవుడ్ బ్యూటీ అడుగు పెడుతుంది.

తాజా వార్తలు