వైరల్ అవుతున్న సల్మాన్‌ ‘సారే జహాసే అచ్చా’ వీడియో...!

నేడు భారతదేశ 74 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అనేకమంది పలువురు రాజకీయ సినీ కళాకారులు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను వారి స్టైల్ లో తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా నేడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన దేశభక్తిని ఓ పాట రూపంలో తానే స్వయంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను దేశ ప్రజలకు తెలియజేశారు.

ఈ వీడియోని బాలీవుడ్ నిర్మాత అఖిల్ అగ్నిహోత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేశారు.ప్రస్తుతం నేడు ఈ దేశ భక్తి పాట దేశం మొత్తంగా వైరల్ గా కొనసాగుతోంది.

ఇక ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సారే జహాసే అచ్చా అనే గీతాన్ని పాడారు.వీడియో చివరన సల్మాన్ ఖాన్ తన రెండు చేతులు జోడిస్తూ నమస్కారం తెలిపాడు.

ఇకపోతే సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి తన ఫామ్ హౌస్ నుండి బయటికి రాకుండా, అక్కడి నుంచే అన్ని పనులు చేస్తూ వచ్చారు.

Advertisement

ఇదివరకు లాక్ డౌన్ సమయంలో కొన్ని పాటలను విడుదల చేసి అభిమానులను అలరించాడు.అయితే ఇది వరకు కూడా సల్మాన్ ఖాన్ కొన్ని సందర్భాల్లో ఆయనే స్వయంగా పాడిన పాటలను విడుదల చేశారు.ఇక మీరు కూడా ఈ వీడియో ను చూసి ఎంజాయ్ చేయండి.

వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..
Advertisement

తాజా వార్తలు