పాలు కాచి చల్లార్చి పుల్లని మజ్జిగ కలిపి.. ఈ పొడి వేసుకొని తాగితే..

సాధారణంగా అందరూ మజ్జిగ ను బట్టర్ మిల్క్ అని పిలుస్తూ ఉంటారు.వేసవి వచ్చేసరికి ఇది కాస్త బెటర్ మిల్క్ గా మారిపోతుంది.

అది ఎలాగంటే మజ్జిగ తాగే వాడికి ఏ వ్యాధులు కలగవని, వచ్చిన వ్యాధులు దూరమై పోతాయని చెబుతూ ఉంటారు.అంతేకాకుండా చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, వేడి తగ్గిపోతాయని శరీరానికి మంచి తేజస్సు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.మజ్జిగ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ దూరమైపోతుంది.

అధిక దాహం తీరుతుంది.అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా ఉంటుంది.

Advertisement
Boil Milk And Cool It And Add Sour Buttermilk.. If You Put This Powder And Drink

జీలకర్ర, ధనియాలు, అవిసె గింజలు, సైంధవ లవణం మెత్తగా పొడి చేసుకుని మజ్జిగలో కలుపుకుని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇలా తయారు చేసుకున్న మజ్జిగ గాని మధ్యాహ్నం సమయంలో మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో తాగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.

Boil Milk And Cool It And Add Sour Buttermilk.. If You Put This Powder And Drink

ముఖ్యంగా చెప్పాలంటే ధనియాలు, జీలకర్ర, సొంటి ఈ మూడింటిని 100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి మూడింటిని కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి దాన్ని సీసాలో భద్రపరచాలి.ఎండలో తప్పనిసరి బయటకు వెళ్ళినప్పుడు ఒక గ్లాసు పాలు తీసుకొని కాచి చల్లార్చి అందులో రెండు గ్లాసుల మజ్జిగ కలపాలి.ఇందులో పంచదార, ఉప్పు బదులుగా పైన చెప్పుకున్న మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అంతేకాకుండా ప్రేగులకు ఇది బలాన్ని ఇస్తుంది.జీర్ణకోశ వ్యాధులు అన్నిటికి ఇది ఎంతో మేలు చేస్తుంది.వీలు అయినంత వరకు మజ్జిగని ఫ్రిజ్లో పెట్టకుండా తాగడమే మంచిది.

అలా పెట్టడం వల్ల ఇందులో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా నిర్జీవమైపోతుంది.అదే విధంగా ప్యాక్ చేసిన మజ్జిగ బదులు అప్పటికప్పుడు తయారు చేసుకున్న తాజా మజ్జిగ తాగడం ఎంతో మంచిది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు