స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పాల‌నుకుంటున్నారా? అయితే బ్లాక్ పెప్ప‌ర్ ఆయిల్‌తో ఇలా చేయండి!

ఇటీవ‌ల రోజుల్లో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది.కొంద‌రు ఒత్తిడి, టెన్ష‌న్స్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స్మోక్ చేస్తుంటే.

మ‌రికొంద‌రు ఫ్యాషన్ కోసం సిగ‌రెట్ల‌ను గుప్పు గుప్పుమ‌నిపిస్తున్నారు.ఫాస్ట్‌ కల్చర్‌ ఎక్కువగా ఉన్న చోట్ల అయితే ఆడ‌వారు సైతం ఏ మాత్రం స్మోక్ చేయ‌డానికి వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

అయితే కార‌ణం ఏదైనా సిగ‌రెట్ల‌ను కాల్చ‌డం వ‌ల్ల కాన్సర్, హార్ట్, ఇంకా లంగ్ డిసీజెస్‌ను ఏరి కోరి కొని తెచ్చుకున్న వార‌వుతారు.అందుకే చాలా మందికి దీన్ని మానేయ్యాలని ఉంటుంది.

కానీ, ఎంత ప్ర‌య‌త్నించినా అది కుద‌ర‌దు.అయితే స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పాల‌నుకునే వారికి బ్లాక్ పెప్ప‌ర్ ఎసెన్షియల్ ఆయిల్ అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.

Advertisement

బ్లాక్ పెప్పర్ ఎసెన్షియల్ ఆయిల్‌లో యాంటీ వైరల్ గుణాలను పుష్క‌లంగా ఉంటాయి.అందు వ‌ల్ల‌, సిగ‌రెట్ కాల్చాల‌నే  ఆలోచ‌న‌ వ‌చ్చిన ప్ర‌తి సారి బ్లాక్ పెప్ప‌ర్ ఆయిల్ వాస‌న‌ను పీల్చాలి.

ఇలా చేస్తే స్మోక్ చేయాల‌న్న కోరిక‌లు క్ర‌మంగా చ‌చ్చిపోతాయి.

అంతే కాదు, రోజుకు రెండు లేదా మూడు సార్లు బ్లాక్ పెప్ప‌ర్ ఆయిల్‌ను స్మెల్ చేస్తే.అందులో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, త‌ల‌నొప్పి వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌న్నింటినీ దూరం చేసి మెద‌డును, మ‌న‌సును ప్ర‌శాంత‌గా మారుస్తాయి.అదే స‌మ‌యంలో జ‌లుబు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే త‌ర‌చూ జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే వారు.మూడు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనెలో మూడు చుక్క‌లు బ్లాక్ పెప్ప‌ర్ ఆయిల్‌ను మిక్స్ చేసి పొట్ట‌పై అప్లై చేయాలి.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఆపై స్మూత్‌గా కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డి.

Advertisement

మ‌ల‌బ‌ద్ధకం, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

" autoplay>

తాజా వార్తలు