దుబ్బాక విన్నర్ ఎవరో ముందే తేల్చిన వికిపీడియా

తెలంగాణలోని దుబ్బాక నియోజకర్గంలో ఇటీవల ఉపఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగా రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఇటీవల ఆయన మృతి చెందారు.

దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నికలను నిర్వహించింది ఎన్నికల సంఘం.

కాగా నవంబర్ 3న ఈ నియోజకవర్గంలో ఎన్నికలను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించింది ఎన్నికల సంఘం.ఇక ఈ ఉపఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీలతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు.

కాగా నవంబర్ 10న దుబ్బాక బైపోల్ కౌంటింగ్‌ను నిర్వహించేందుకు అధికారులు అన్ని విధాలా రెడీ అయ్యారు.అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన రావు గెలుపొందినట్లు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ వికిపీడియాలో ముందే ప్రకటించారు.

దుబ్బాక నియోజకవర్గం అని టైప్ చేస్తే 2020 ఉపఎన్నికలో రఘునందన రావు గెలిచినట్లు అందులో చూపిస్తోంది.అంతేగాక ఓట్ల శాతాన్ని కూడా ఇందులో పొందుపర్చారు.బీజేపీ అభ్యర్థి రఘునందన రావు 22,595 ఓట్ల ఆధిక్యత లభించినట్లు వికిపీడియాలో చూపించారు.13.75 శాతం మెజారిటీ ఓట్లతో బీజేపీ ఈ ఘన విజయం సాధించినట్లు అందులో ఉంది.దీంతో జనంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అవాక్కవుతున్నారు.

Advertisement

ఎన్నికల ఫలితాలు తేలకముందే, ఇలా ఇంటర్నెట్‌లో రఘునందన రావును విజేతగా ప్రకటించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఏదేమైనా ప్రతిష్టాత్మకంగా జరిగిన దుబ్బాక్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

నువ్వా-నేనా అనే రీతిలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్తి సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థి రఘునందన రావు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస రెడ్డిలో ఎవరు విజయం సాధిస్తారో మరికొద్ది గంటల్లోనే తేలనుంది.మరి వికిపీడియాలో బీజేపీ విజయం సాధించారనే అంశం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు