అధికారం కోసమే ఈ ఆరటామా!!!

రాజకీయాల్లో స్నేహం.శతృత్వం షరా మామూలే.

నిన్న కలిసి ఉన్న వారు నేడు శత్రువులుగా మారవచ్చు.

ఇక నిన్నటి వరకు విమర్శించుకున్న వారి నేడు కలిసి కూర్చును ఒకే పార్టీలో పని చెయ్యవచ్చు.

అసలు విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశానికి మిత్రపక్షంగా మారి గత ఎన్నికల్లో ఎన్నికల బరిలో దిగిన కమలం పార్టీ ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకుని సోలో గా వచ్చే ఎన్నికల్లో నిలబడాలని పక్కా స్కెచ్ వేస్తుంది.అందులో భాగంగానే అధిష్ఠానం ఆదేశాల మేరకే సొంత కేడర్ ను బలోపేతం చేయాలని ముందుకు దూసుకెళ్తుంది.

అందుకే 2019లో కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ర్టాలే కీలకమని భావిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీపై దృష్టిసారించినట్లు తెలిసింది.ఆ వ్యూహంలో బాగంగానే బలమైన సామాజికవర్గాలు, వ్యక్తిగత ఇమేజ్ ఉన్న ఇతర పార్టీల నేతలకు గాలం వేయాలని కమలం అధిష్టానం ఎత్తులు వేస్తున్నట్లు సమాచాచారం.

Advertisement

ఇక తెలుగుదేశం పై పురంధీశ్వరి చేసిన కామెంట్స్ కూడా ఆ పార్టీ యొక్క ముందు చూపుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.గుంటూరు జిల్లా పెద్ద నందిపాడులో బీజేపీ కార్యాలయాన్ని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పురంధరేశ్వరి కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ తనకి అనుకూలంగా వోన్ చేసుకునే తీరును తప్పుపట్టారు.

వ్యక్తిగత మరుగుదొడ్లకు కేంద్ర ప్రభుత్వ నిధులు వెచ్చిస్తుంటే.ఆ ఘనతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు, పించన్ పెంపు లాంటి పథకాల్ని రాష్ట్ర ప్రభత్వ కార్యక్రమాలుగా చెప్పుకోవడం తగదన్నారు పురందేశ్వరి.అంతేకాదు ఏపీలో కరెంట్ కొరత లేపోవడానికి కేంద్రమే కారణమని.

నిరంతర విద్యుత్తు సరఫరాకు ఉద్దేశించిన పైలెట్ ప్రాజెక్టును కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఇంతవరకు ఎలా ఉన్నా తెలుగుదేశాన్ని తలదన్ని కమలో సీమాంద్రలో వికసించాలంటే ఒకింత ఇబ్బందే అన్న వాదనా లేకపోలేదు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..

చూద్దాం 2019లో ఏం జరుగుతుందో.

Advertisement

తాజా వార్తలు