కేసీఆర్ జగన్ మధ్య పొగ పెడుతున్న బీజేపీ ?

రెండు తెలుగు రాష్ట్రాలపై కన్నేసిన బిజెపి మైండ్ గేమ్ పాలిటిక్స్ కు తెర తీసినట్లు గా కనిపిస్తోంది.

ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీకి అందుకు తగ్గ అనుకూల పరిస్థితులు రాకపోవడంతో, సైలెంట్ గా ఉంటూ వస్తోంది.

ముఖ్యంగా తెలంగాణ, ఏపీలలో బలపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో తెలంగాణ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడడం, బీజేపీకి అక్కడ సానుకూల పరిస్థితులు పెరుగుతుండడంతో, వచ్చే ఎన్నికల నాటికి తప్పనిసరిగా తెలంగాణలో అధికారంలోకి వస్తామనే నమ్మకంతో బిజెపి నాయకులు కనిపిస్తున్నారు.

దీనిలో భాగంగానే, ప్రస్తుతానికి బలంగా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్ ను బలహీనం చేసే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు గా వ్యవహరిస్తోంది., టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా, వదులుకోకుండా వాడుకుంటూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో బిజెపి సక్సెస్ అవుతూ వస్తోంది.

అదీ కాకుండా, ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన ఎంపీ బండి సంజయ్ కు బిజెపి పగ్గాలు అప్పగించడం ద్వారా, తెలంగాణలో దూకుడుగా వెళుతూ, అధికారం వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది.ఇక ఏపీ పైన దృష్టి సారించిన బిజెపి అక్కడ అధికార పార్టీలో ఉన్న వైసిపి తో సన్నిహితంగా మెలుగుతూ, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, జగన్ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలుకుతూ, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ని బలహీనం చేయడం ద్వారా ఆ స్థానాన్ని దక్కించుకుంటే మెల్లిగా బీజేపీ కి ఏపీలో అవకాశం దక్కుతుందనే అభిప్రాయంలో బీజేపీ అగ్ర నాయకులు సైతం ఉన్నారు.

Advertisement

అందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు, ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, బిజెపి పట్టించుకోనట్టు వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ, ఏపీ సీఎం జగన్, కెసిఆర్ మధ్య ఉన్న స్నేహం బహిరంగ రహస్యమే.

ఒకరికొకరు అన్ని విషయాల్లో సహకరించుకుంటూ వస్తున్నారు.ఒక రకంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ తన వంతు సహకారం అందించారనే విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఇద్దరు మిత్రులు మధ్య పొగ పెట్టడం ద్వారా, రాజకీయంగా పైచేయి సాధించాలనే అభిప్రాయంతో బీజేపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.అందుకే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో కేంద్రం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఈ జల వివాదాల విషయంలో ఏపీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా బిజెపి కనిపిస్తోంది.ఇప్పటికే ఏపీ ఫిర్యాదు మేరకు తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వెంటనే నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంపై టిఆర్ఎస్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

ఏపీకి అనుకూలంగా బిజెపి వ్యవహరిస్తోందని టిఆర్ఎస్ ఇప్పుడు కొత్త రాగం అందుకోవడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది.ఇటీవల సీఎంల సమావేశంలో తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతుండడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏపీని ఆదర్శంగా తీసుకోవాలంటూ చెప్పడం వంటి చర్యల ద్వారా కెసిఆర్ జగన్ మధ్య వైరం పెంచి తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్టుగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు