BJP: రాజ్యం, మతం కలిస్తే విధ్వంసమే

ప్రస్తుతం భారత రాజకీయాలు విధ్వంసకర విద్వేష కరంగా మారడానికి రాజ్యాంగ, లౌకిక స్ఫూర్తికి విరుద్దంగా మత విశ్వాసాలను రాజకీయాల్లోకి చొప్పించి,తెచ్చి దానికి పెద్ద పీట వేయడం వల్లే నేడు దేశం ఆర్థిక, సామజిక, పారిశ్రామిక రంగాల్లో విఫలం చెందింది.

రాజ్యాంగ రచయిత డా బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా సెక్యూలరిజం, డెమోక్రసీ అనేది మన జీవన విధానంలో భాగమన్నారు దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆధునిక భారత దేశ నిర్మాణం కావాలంటే అన్ని మత గ్రంధాలకున్న సార్వభౌమాధికారాన్ని తిరస్కరించాలి.గత ప్రపంచ విప్లవాలను అభివృద్ధి చెందిన దేశాల చరిత్ర ను మనం ఇక్కడ పరిశీలిస్తే అక్కడి ప్రభువుల పాలన గద్దె దిగడానికి ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయింట్ ఏంటంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాలన రాజ్యంలో మతాచార్యుల పెత్తనం ఇప్పుడు ఇది ప్రస్తుత భారత దేశ ప్రధాని మోడీ పాలన తీరుకు అచ్చు గుద్దినట్లే ఉంది.

ప్రెంచ్, రష్యా, అమెరికా దేశాలలో వచ్చిన ప్రజా విప్లవాలు తదనంతర ఫలితాలు ఆయా దేశాల్లో అభివృద్ధికి బాటలు వేశాయి.రష్యా నేలిన జార్జ్ చక్రవరుల నిరంకుశ పాలనలో హక్కులుసౌకర్యాలు కేవలం ప్రభువులు భూస్వాములకే ఉండి రైతులు, సామాన్య ప్రజలు మాత్రం పని చేయాలి పన్నులు కట్టాలి.

రష్యా బాష తప్ప ఇతర ప్రాంతీయ భాషలు మాట్లాడొద్దు కార్మికులు మహిళలు బాలకార్మికులు తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమ చేయాలి జార్జీ ప్రభువులు యుద్దాల పేరుతొ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం రష్యా యుద్దాన్ని కూడా వ్యాపారంగా భావించారు.కనుక లక్షలాది మంది సైనికులు చనిపోయారు.

Advertisement

చివరికి దేశంలోని రైతులు, పేదలు, కార్మికులందరు ఏకమై నిరంకుశ జార్జి ప్రభువులను కూలదోచారు.అమెరికా విప్లవం1492లో కొలంబస్ అమెరికా ను కనుగొన్న తర్వాత ప్రెంచ్ వలసలు బ్రిటిష్ ఇంగ్లాండ్ ప్రభుత్వ నిరంకుశ చట్టాలు పన్నులు మార్కెంటైల్ సిద్ధాంతం, నౌక చట్టం తెచ్చి ఎగుమతులు దిగుమతులు వారి నౌకల లోనే చేయాలి 1764 స్టాంప్ లు క్రయ విక్ర యాలకు వారివే కొనాలి.

మొలాసిస్ చట్టం అమెరికా వలస ప్రజల డిక్లరేషన్ చట్టం అమెరికా బోస్టస్ ప్రాంతం లో కిరాయి గుండాలు సైనికులు కలిసి ప్రజల పై దాడి చేయడం తీయాకు పెట్టెలను సముద్రం లో పారవేయడం ఇవన్నీ కూడాఅమెరికా విప్లవానికి దారి తీశాయి.వలస ప్రజలు ఏకమై బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాయి.1783లో మొట్ట మొదటి సారిగా స్వేచ్ఛ, లౌకికకత్వ,సౌభ్రాతుత్వం తో అమెరికా ప్రభుత్వం ఏర్పడి జార్జ్ వాషింగ్టన్ మొదటి అధ్యక్షులు అయ్యారు.1789 లో ప్రెంచ్ విప్లవం రావడానికి మూల కారణం పాలకులు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు.మతాచార్యులు ప్రభువులు హక్కులు న్న వర్గం సామాన్య ప్రజలు పనులు చేయాలి పన్నులు కట్టాలి.

ప్రెంచ్ రాజులు లూయి"నేనే రాజ్యం నా మాటే శాసనం అని అనవసర యుద్దాలు చేసి దేశాన్ని అప్పుల పాలు చేశాడు చివరికి ప్రజలు తిరుగుబాటు చేసి రాజును గద్దెదించారు.

ప్రెంచ్ విప్లవం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తన రాజ్యాంగం లో పొందు పరచినారు.ప్రభుత్వంలో చర్చిల పెత్తనాన్ని నిషేదించారు.ప్రభుత్వం రాజ్యం మతాన్ని ఫిల్టర్ గా వాడుకోవద్దని ప్రభుత్వ కట్టడాల్లో మతా చారాలు ఉండొద్దని చర్చి తప్పించి ఇతర ఆస్తులు ఉండొద్దని 1905 లో ప్రెంచ్ లా ను చేయడం వల్ల ఆ దేశానికి మతాచార్యుల నుండి పెద్ద అపాయం తప్పిపోయింది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

చర్చిల ఆస్తులను రాజ్యం వశం చేసుకోంది.బీజేపీ మతాన్ని స్వామీజీలను దుర్వినియోగం చేస్తుంది.బీజేపీ ప్రారంభం అయిందే.

Advertisement

ద్వీ జాతీయ సిద్ధాంతంతో ఇతర మతాల మనుషుల పట్ల ఆచార వ్యవహారాల్లో నిలువెల్లా విషమే.చిమ్ముతుంది బీజేపీ వద్ద ఈ దేశానికి,ప్రజలకు ఉపయోగపడే ఏజెండాగాని ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి ఆలోచన,నిరుద్యోగ నిర్మూలన పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు లేనే లేవు నిర్మించడం రాదు "తోడో పొడో" కూల్చడం కాల్చడం విధ్వంసాలే ఆ పార్టీకి ముద్దు అదే వారికీ ఆయువు పట్టు దేశంలోని ప్రజలు ఐక్యంగా ఉండకుండా కులం, మతం, ప్రాంతీయ, బాష ఆచారం, వ్యవహారాలలో ఎల్లపుడు కొట్టుకొని ఛస్తే వారు పండగా చేసుకొంటారు.

మొత్తానికి శవాలపై ఓట్లు సీట్లు కావాలి తప్ప దేశం శాంతి భద్రతలు వారికి ఏమాత్రం అవసరం లేదు.

ఇప్పుడు బీజేపీలో సరికొత్త స్కీం అదే స్కాం ప్రారంభం అయింది దానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు.ఆ శాఖకు మంత్రి గుజరాత్ అల్లర్ల సూత్రాధారి తడిపార్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చివేయడం దాని ప్రత్యేకత అందుకు పవిత్రమైన స్థానంలో పూజింప బడుతున్న ఆయా మతాల స్వామీజీలను,బాబాలను బ్రోకర్లగా చేసుకొని వారితో బీజేపీ పబ్బం గడుపుతుంది.బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 రాష్ట్ర ప్రభుత్వాలను ఆయా పార్టీల ఎమ్మెల్యేలను కొని కూల్చి వేసింది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, తదితర ప్రభుత్వాలను వందల కోట్లతో కొని వినకపోతే ఈ డి, సి బి ఐ, ఐ టి ల పేరుతో బెదిరెంచి ఆయా శాసన సభల్లో తమకు బలం లేకున్నా కూడా అప్రజా స్వామికంగా తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోంది.

ఇందులో బీజేపీ అగ్ర నాయకత్వమే ప్రోత్సహించిన విషయం స్పష్టం.

ఇదే తతంగాన్ని తెలంగాణా రాష్ట్రం లో స్వామీజీ లను దళారుగా నియమించుకొని పార్టీ మారే ఒక్కో ఎమ్మెల్యే కు 100 కోట్ల బేరం పెట్టారు.ఈ విషయం లో పోరాట బిడ్డలైన ఆ నలుగురు ఎమ్మెల్యే లు ఆత్మగౌరంతో వారి పన్నా గాన్ని బయట పెట్టి ప్రజా స్వామ్యాన్ని తెలంగాణా ఆస్తిత్వాన్ని కాపాడారు వారికి తెలంగాణా సమాజం సదా రుణపడి ఉంటుంది.బీజేపీది ఒకే దేశం ఒకే పాలన .ఒకే భాష ఒకే మతం వారి హిడెన్ ఎజెండా అందుకే ప్రజా స్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను నిసిగ్గుగా కూల్చి వేస్తుంది మరి దీనికి అంతం లేదా? బీజేపీ పార్టీ చేసే ఈ దుర్మార్గపు, నీచ రాజకీయాల వల్ల సమాజంలో మంచిని ప్రభోదించే ఆధ్యాత్మిక స్వాములు అప్రతిష్ట పాలు అవుతున్నారు.వీరు ఒక్కో రాష్ట్రం లో ఒక్కొక్క స్వామీజీలను, బాబాలను తయారు చేసుకోండి.

వీళ్ళళ్ళలో అసాంఘిక కార్యా క్రమాల్లో పాల్గొని జైళ్లకు వెళ్లిన వారు కూడా ఉన్నారు.ఆశరామ్ బాపూజీ డేరా బాబా లతో అమిత్ షా కు సంభందాలు ఉన్నాయి.

నిన్న మొన్ననే ఓట్లకోసం డేరా బాబా ను పేరోల్ మీద విడుదల చేశారు.యూపీ సీఎం యోగి కూడా స్వామీజీ నే కదా అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు ప్రతిరోజూ దళితుల పై హత్యలు అత్యాచారాలు మామూలే .రోజుకు మూడు హత్యలు ఆరు రేప్ ల తో యూపీ లో పాలన కొనసాగుతుంది.ఆంధ్ర- తెలంగాణాలలో రాజకీయ ప్రవేశం చేయాలను కుంటున్న పరిపూర్ణ నంద స్వామి బీజేపీ అనుబంద స్వామినే కర్ణాటక రాష్ట్రం లో అక్కడి రాజకీయాల్లో 30 ఏళ్లుగా స్వాములు, మఠాలు, మఠాదీపతులు జోక్యం చేసుకుంటున్నాయి.

తాజా వార్తలు