Jagan AP : ముప్పై ఏళ్ల ధీమాలో జగన్ ! గ్రూపు రాజకీయాలపై క్లాస్

2024 ఎన్నికల్లో వైసీపీకి కనీసం 30 సీట్లు కూడా రావని ఆ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.జగన్ పాలనలో జనాలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఆ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టిడిపి , జనసేన , బిజెపి వంటి పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.

 Jagan In Thirty Years Slow! A Class On Group Politics , Jagan, Ap Cm Jagan, Ysrc-TeluguStop.com

అయితే జగన్ మాత్రం 175 స్థానాలను గెలుచుకుంటామని చెబుతూనే, పార్టీ నేతలకు ఆ టార్గెట్ ను విధించారు.ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు ఇలా అంతా జనాల్లోకి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి,  ఇప్పటివరకు అమలు చేసిన పథకాల ద్వారా ఎవరెవరు ఎంత స్థాయిలో లబ్ధి పొందారనే విషయాన్ని గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

 తాజాగా పార్టీ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో జగన్ అనేక అంశాలను ప్రస్తావించారు.గ్రూపు రాజకీయాలు ఏమన్నా ఉన్నా.వాటిని పక్కన పెట్టేయాలని, రాబోయే ఎన్నికలు మనకు అత్యంత కీలకమని జగన్ చెప్పుకొచ్చారు.‘ ఈ ఒక్క ఎన్నికలలో మనం గెలిస్తే ఆ తర్వాత 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని జగన్ చెప్పుకొచ్చారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% కు పైగా నెరవేర్చాం, పథకాలను మార్గదర్శకంగా అమలు చేస్తున్నాం , అందువల్ల 175 కి 175 ఎందుకు రావు అనే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పని చేయాలి ‘ అంటూ జగన్ ప్రసంగించారు.  నిన్ను క్యాంపు కార్యాలయంలో విశాఖ ఉత్తరం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా ఉన్న కేకే రాజునే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అంటూ ప్రకటించారు.మొన్న ఎన్నికల్లో ఇక్కడ గెలవాల్సింది ఈసారి ఆ తప్పులేవి పునరావృతం కాకుండా చూసుకుని రాజుని గెలిపించుకు రావాలి అంటూ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.మీరు నేను ఎవరి పని వారు చేస్తే.175 కు 175 అనే మన లక్ష్యం కచ్చితంగా సాధ్యమవుతుందని జగన్ క్లారిటీ ఇచ్చారు.
 

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Ys Jagan, Ysrcp-Political

ఈ సమావేశానికి వచ్చిన వారందరితో వ్యక్తిగతంగా మాట్లాడిన జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోను గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంపై జగన్ సీరియస్ గానే ఉన్నారు.పార్టీకి చెందిన కీలక నాయకుల ద్వారా, ఆ గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టే లా,  పార్టీ నాయకులంతా యాక్టివ్ గా పనిచేసే విధంగా కసరత్తు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే ఒక్కో నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులను తాడేపల్లికి పిలిపించి మరి , గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా జగన్ స్వయంగా రంగంలోకి దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube