బీజేపీకి కొత్త బాస్‌ వచ్చేశాడు

గత కొంత కాలంగా బీజేపీకి బాస్‌గా ఉన్న అమిత్‌ షా ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న కారణంగా పార్టీ బాధ్యతలను మరెవ్వరికైనా అప్పగించాల్సిన సమయం వచ్చింది.

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి మొదటి నుండి కూడా జేపీ నడ్డా పేరును పరిశీలిస్తున్నారు.

ఆమద్య నడ్డాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూడా నియమించిన విషయం తెల్సిందే.నేడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్‌ పక్రియ జరిగింది.

నామినేషన్స్‌ గడువు ముగిసే సమయానికి జేపీ నడ్డా మాత్రమే నామినేషన్‌ వేశారు.నేడు జేపీ నడ్డ అధ్యక్షుడిగా ఖరారు అయ్యాడు.

అయితే పార్టీ రాజ్యాంగం ప్రకారం రేపు ఓటింగ్‌ జరగాల్సి ఉంది.ఒక్క నామినేషన్‌ రావడం వల్ల ఏకగ్రీవంగా జేపీ నడ్డాను అధ్యక్షుడిగా ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

బీజేపీ ఎన్నికల కమీషన్‌ ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రకటన సిద్దం చేస్తుంది.ఇక పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎంపిక అయిన విషయాన్ని పార్టీ అధినాయకత్వం నేడో రేపో లాంచనంగా ప్రకటించబోతున్నారు.

అమిత్‌ షా ఆధ్వర్యంలో పార్టీ ఎన్నో విజయాలను దక్కించుకుంది.మరి నడ్డా హయాంలో ఎలాంటి ఫలితాలను బీజేపీ దక్కించుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు