ఎన్నికల వేళ బీజేపీ నేతకు షాకిచ్చిన ఈసీ.. ఆయన ప్రచారం నిషేధం.. ?

ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కొందరి నేతలకు సహజం అయ్యింది.

కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా ఇలాంటి సందర్భాన్నే బీజేపీ కీలక నేత హిమాంత బిష్వ శర్మ ఎదుర్కొన్నారు.ఆ వివరాలు చూస్తే బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)చీఫ్‌ హగ్రామా మోహిలరీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ద్వారా అక్రమంగా జైలుకు పంపిస్తానని బీజేపీ నేత శర్మ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ బీపీఎఫ్ మిత్ర పక్షం కాంగ్రెస్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ శర్మపై నిషేధం విధించింది.రెండు రోజుల పాటు పార్టీ ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల వేళ అసోంలో ఇలా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని ఊహించని నేతలు ఒక్క సారిగా షాక్ అయ్యారట.అయితే తనపై ఎన్నికల సంఘం విధించిన నిషేదంపై బీజేపీ నేత హిమాంత బిశ్వర్మ గువహతి హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement
బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

తాజా వార్తలు