బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణలో మద్యం ఆదాయ వనరుగా మారిందన్నారు.

ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ.ఎక్సైజ్ ప్రమోషన్ శాఖ అయిందని విమర్శించారు.మద్యం పాలసీ కోసం బీఆర్ఎస్, ఆప్, వైసీపీ నేతలు ఒక్కటయ్యారని లక్ష్మణ్ ఆరోపించారు.

సీబీఐ, ఈడీ దాడులన్నీ కేంద్ర ప్రభుత్వ దాడులైతే పోలీస్, ఏసీబీ కేసులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పెడుతుందా అని ప్రశ్నించారు.తప్పులను ఎత్తి చూపితే మీడియా సంస్థలను బ్యాన్ చేసామంటారా అని నిలదీశారు.

ఆర్జేడీ, ఎస్పీ, ఎంఐఎంలు మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీలే రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ తొలి ప్రసంగాన్ని బహిష్కరించింది బీఆర్ఎస్సేనని ఆరోపించారు.మహిళా గవర్నర్ ను అవమానించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు