ఏపీ బీజేపీ నుంచి కీల‌క నేత స‌స్పెన్ష‌న్‌.. పార్టీలో ప్ర‌కంప‌న‌లు..

ఏపీ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడిగా వ‌చ్చిన సోము వీర్రాజు పార్టీలో గీత దాటే వాళ్ల విష‌యంలో ఎంత మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.

ముఖ్యంగా టీడీపీ వాస‌న‌లు, చంద్ర‌బాబుతో సాన్నిహిత్యం ఉన్న వారిని వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెడుతూ వ‌స్తున్నారు.

 ఈ విష‌యంలో కేంద్ర స్థాయిలో ప‌రిచ‌యాలు ఉన్న పెద్ద నాయ‌కుల సంగ‌తి ఎలా ?  ఉన్నా మిగిలిన చిన్నా చిత‌కా నేత‌ల‌ను సీరియ‌స్‌గా దృష్టి సారిస్తున్నారు.తాజాగా ఆ పార్టీ త‌ర‌పున మీడియాలో బ‌ల‌మైన వాయిస్ వినిపించే లంకా దిన‌క‌ర్‌పై సోము వీర్రాజు వేటు వేయ‌డం పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

టీడీపీ నుండి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఛానల్స్ లో బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డంతో పాటు మంచి గొంతుక‌గా మారారు లంకా దిన‌క‌ర్‌.అయితే తాజాగా ఈ రోజు ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్టు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.

పార్టీ కార్యాల‌య సెక్రటరీ శ్రీనివాసరావు పేరుతో దినకర్ కు సస్పెన్షన్ లేఖ పంపారు.స‌స్పెన్ష‌న్ లేఖ‌లో పార్టీ నియ‌మాలు, నిబంధ‌న‌లు ఉల్లంఘించినందునే స‌స్పెండ్ చేశామ‌ని చెప్పారు.పార్టీ విధానానికి వ్య‌తిరేకంగా సొంత అభిప్రాయాల‌తో వెళుతూ పార్టీకి న‌ష్టం కలిగించేలా దిన‌క‌ర‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.

Advertisement

అలాగే చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నార‌ని కూడా సోము పేర్కొన్నారు.ఇక జూలై 26న జ‌రిగిన మీడియా చ‌ర్చ‌ల్లో దిన‌క‌ర‌న్ పాల్గొన్నందుకు ఆయ‌నక నోటీసులు ఇచ్చామ‌ని.

అయితే స‌రైన వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతోనే పార్టీ నుంచి స‌స్పెండ్ చేశామ‌ని సోము పేర్కొన్నారు.గ‌తంలో పాల్గొన్న చ‌ర్చ‌ల‌కు షోకాజ్ నోటీసులు పంపినా వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా మ‌ళ్లీ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నందునే ఆయ‌న్ను స‌స్పెండ్ చేశామ‌ని బీజేపీ నేత‌లు చెపుతున్నారు.

అయితే ఇంట‌ర్న‌ల్ టాక్ ప్ర‌కారం దిన‌క‌ర్ టీడీపీకి అనుకూలంగా మీడియా చ‌ర్చ‌ల్లో పాల్గొంటున్నార‌ని.బీజేపీ త‌ర‌పున చ‌ర్చ‌ల్లో పాల్గొంటూ చంద్ర‌బాబు, టీడీపీకి స‌పోర్ట‌ర్‌గా ఉండ‌డంతో పాటు ఆ పార్టీ క‌నుస‌న్న‌ల్లో ఉంటున్నార‌న్న సందేహంతో ఆయ‌నకు వార్నింగ్ ఇచ్చినా ఆయ‌న తీరు మార‌క‌పోవ‌డంతోనే స‌స్పెండ్ చేశార‌ని అంటున్నారు.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు