నేడు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ

ఢిల్లీలో ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకానుంది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాపై కసరత్తు చేయనుంది.

ఈ క్రమంలోనే రేపు బీజేపీ మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ కీలక భేటీ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఢిల్లీకి బయలుదేరారు.

అయితే రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేసిన లిస్ట్ ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు చేరిన సంగతి తెలిసిందే.ఇందులో మార్పులు చేర్పుల తరువాత జాబితాను సీఈసీ ముందు పెట్టనున్నారుని తెలుస్తోంది.

ఈ క్రమంలో భేటీ అనంతరం రేపు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు