ఆ అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజారిటీ రాబోతోందా..?

2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే జనసేన పార్టీ( Janasena Party ) గ్రాఫ్ ఇప్పుడు బాగా పెరిగింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అప్పట్లో పార్టీ కి జిల్లాల వారీగా ఇంచార్జీలు కూడా ఉండేవారు కాదు, కానీ ఇప్పుడు క్షేత్ర స్థాయి నుండి ఈ పార్టీ కి కమిటీలు ఉన్నాయి.లోకల్ బాడీ ఎన్నికలలో పోటీ కూడా చేసింది.300 ఎంపీటీసీలు మరియు రెండు జీడీపీటీసీ స్థానాలు కూడా గెలుచుకుంది.ఇలా ఏ విధంగా చూసుకున్నా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ గ్రాఫ్ ఎగువ స్థాయిలోనే ఉంది.కొన్ని విశ్వసనీయ సర్వేల ప్రకారం జనసేన పార్టీ ఓటు బ్యాంకు 7 నుండి 15 శాతం కి ఎగబాకింది అట.ముఖ్యంగా కోస్తాంధ్ర లో ఈ పార్టీ టీడీపీ మరియు వైసీపీ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ ఓట్ బ్యాంక్ కలిగి ఉందట.అయితే ప్రస్తుతం రాష్ట్రము లో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా టీడీపీ మరియు జనసేన రెండు కలిసి పోటీ చెయ్యబోతున్నాయి.

 Is Janasena Party Going To Get A Majority Of One Lakh Votes In That Assembly Sea-TeluguStop.com
Telugu Janasena, Votes Majority, Pawan Kalyan-Telugu Political News

వైసీపీ పార్టీ ని( YCP ) గద్దె దించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే కచ్చితంగా కోస్తాంధ్ర మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని, అధికార వైసీపీ పార్టీ కి చావు దెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ కి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదట.ఇకపోతే జనసేన పార్టీ కి అత్యధిక మెజారిటీ వచ్చే కొన్ని స్థానాలు ఉన్నాయట.

వాటిలో అమలాపురం ( Amalapuram ) ఒక్కటి.గత ఎన్నికలలో ఈ స్థానం లో జనసేన పార్టీ రెండవ స్థానం లో నిల్చింది.

అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది.కానీ ఇప్పుడు టీడీపీ( TDP ) బలంగా కూడా జనసేన కి తోడు అవ్వడం తో కచ్చితంగా ఈ స్థానం నుండి లక్ష ఓట్ల మెజారిటీ తో జనసేన పార్టీ గెలుపొందే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి.

Telugu Janasena, Votes Majority, Pawan Kalyan-Telugu Political News

గతం లో ఈ స్థానం నుండి శెట్టి బట్టులా రాజబాబు( Settibathula Rajababu ) జనసేన పార్టీ తరుపున పోటీ చేసాడు.ఈసారి కూడా ఆయనే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.రెండు లక్షల 21 వేల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం లో వైసీపీ కి ఈసారి 30 వేల ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు.పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ కి కూడా ఈ ప్రాంతం లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

చూడాలి మరి రాబొయ్యే రోజుల్లో ఈ స్థానం జనసేన కి ఇంకా ఎంత బలంగా మారబోతుంది అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube