ఢిల్లీ ఆప్ కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నం

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.అనంతరం సీఎం కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

కాగా మద్యం కుంభకోణం కేసు సప్లిమెంటరీ ఛార్జిషీట్ లో ఈడీ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే.లిక్కర్ పాలసీ అక్రమాల వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు