ఇలా అయితే వందేళ్ల‌యినా టిడిపీకి మిత్ర‌ప‌క్షంగానే..

అధిష్టానం అనుమ‌తి లేకుండా ఎవ్వ‌రూ టీడీపీ నేత‌ల‌తో భేటీ కావ‌టం కానీ, విమ‌ర్శ‌లు గుప్పించ‌టం కానీ చేయ‌ద్దంటూ హుకుం జారీ ఏపి బిజేపీ నేత‌ల‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ష నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలందాయి.

ఏపిలో బ‌లం పెంచుకునేందుకు తాము ప్ర‌య‌త్నిస్తంటే ప్రోత‌స్హించాల్సింది పోయి.

ఇలా అధ్య‌క్షుల వారు సెల‌వీయ‌టంతో అవాకాశం దొరికి న‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబుపై పురంద‌రేశ్వ‌రి, క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌తో పాటు రాష్ట్ర బిజేపి అధ్య‌క్ష రేసులో ఉన్న సోము వీర్రాజుతో స‌హా ప‌లువురు రాష్ట్ర బిజేపి నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేద‌ని స‌మాచారం పైగా ఎవ‌రెవ‌రు ఏం చేసినా, ఏం మాట్లాడాల‌నుకున్నా ముందుగా పార్టీ అనుమ‌తి తీసుకోవాల‌ని కండిష‌న్లు పెట్ట‌డంపైనా మండి ప‌డుతున్నారంట వీరంతా, కాంగ్రెస్‌లో ఉన్న‌న్నాళ్లు నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడ‌ట‌మే అల‌వాటైన ఈ మాజీ కాంగీయులు ఇదెక్క‌డి క్ర‌మ‌శిక్ష‌ణ అంటూ వాపోతున్నార‌ట‌.ఇక , బీజేపీ అధిష్టానం నిర్ణ‌యించిన వారు మాత్ర‌మే టీడీపీతో ట‌చ్‌లో ఉండాల‌ని, మిగిలిన వారంతా కేంద్ర ప‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌చారానికి స‌న్న‌ధ్ధంగా ఉండాల‌ని స్ప‌ష్టంగా చెప్ప‌డంతో ఇదెక్క‌డి లెక్కో అర్ధంకాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట వీరంతా.

ఇక రాష్ట్రానికి వ‌చ్చే వారంతా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుని తె పొగిడే వారే త‌ప్ప కేంద్రం ఇస్తున్న నిధుల విష‌యం చెప్ప‌ర‌ని, ఇలా అయితే ఏపీలో బీజేపీని పుంజుకునే మాట దేవుడెరుగు, మ‌రో వందేళ్ల‌యినా టిడిపీకి మిత్ర‌ప‌క్షంగానే మిగిలిపోవ‌టం ఖాయ‌మ‌ని ఉసూరు మంటున్నారీ నేత‌లంతా.

పవన్ ప్లాన్ : పెద్ద నాయకులు టిడిపిలోకి ... చిన్న నాయకులు జనసేనలోకి 
Advertisement

తాజా వార్తలు