బిగ్ బాస్ సీజన్ 6 పై ఆ ఎఫెక్ట్ ఉంటుందా..?

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ సక్సెస్ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఓటీటీ బిగ్ బాస్ నడిపించారు.కేవలం డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్స్ మాత్రమే ఆ షో చూసేలా.

24 గంటల ఎంటర్టైన్ మెంట్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ వచ్చింది.అయితే తెలుగులో ఓటీటీ బిగ్ బాస్ కొంతమేరకు ఓకే అనిపించుకుందని చెప్పొచ్చు.

అయితే బిగ్ బాస్ టీం ఆశించిన స్థాయిలో మాత్రం 24/7 నాన్ స్టాప్ షో క్లిక్ అవలేదు.అంతేకాదు అంతకుముందు బిగ్ బాస్ అంటే కాస్త కూస్తో ఇంట్రెస్ట్ చూపించే వారు కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ వల్ల షో మీద ఆసక్తి చూపట్లేదని తెలుస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో మొదలు కావొస్తున్నా సరే రాబోయే సీజన్ లో కంటెస్టంట్స్ ఎవరెవరు అని ఆడియెన్స్ ఏమంత పెద్ద ఆసక్తి చూపించట్లేదు.అంతేకాదు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎఫెక్ట్ బిగ్ బాస్ సీజన్ 6 మీద ఖచ్చితం గా పడుతుందని చెప్పుకుంటున్నారు.

Advertisement

అందుకే సీజన్ 6 మీద పెద్దగా బజ్ ఏర్పడటం లేదని అంటున్నారు.ఓ విధంగా అది నిజమే అని చెప్పొచ్చు.

బిగ్ బాస్ ఐదు సీజన్లు చూసిన ఆడియెన్స్ కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ ని లైట్ తీసుకున్నారు.అయితే అలాంటి ఆడియెన్స్ మళ్లీ సీజన్ 6కి ట్యూన్ అవుతారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు