అంగరంగ వైభవంగా యాంకర్ రవి పుట్టినరోజు వేడుకలు.. కూతురుతో సెంటిమెంట్?

బిగ్ బాస్ సీజన్ 5 రాకెట్ లా దూసుకు పోతోంది.

మొన్నటిదాకా గొడవలు, కొట్టు కోవడాలు అన్నీ అయిపోయాక ఇప్పుడు బర్త్ డేల పర్వం మొదలైనట్టు కనిపిస్తోంది.

తాజాగా షణ్ముఖ జశ్వంత్ పుట్టినరోజు వేడుకలను బిగ్ బాస్ ఘనంగా జరిపారు.జశ్వంత్ జీవితంలో గుర్తుండి పోయేలా తన ప్రియురాలు దీప్తి సునయనతో విషెస్ చెప్పించడం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఇక ఆ తర్వాత శ్వేత కూడా తన పుట్టిన రోజును ఇంటి సభ్యులతో వేడుకగా జరుపుకున్నారు.ఇప్పుడు బర్త్ డే లిస్ట్ లో ఉన్నది యాంకర్ రవి అని తెలుస్తోంది.

తెలుగు బుల్లితెరలో ప్రస్తుతమున్న ది బెస్ట్ యాంకర్లలో రవి ఒకరు.పంచ్‌లతో, కామెడీతో, యాక్టింగ్‌తో అటు అభిమానులు, ఇటు ఆడియన్స్‌ ను ఎంటర్‌టైన్‌ చేయడంలో యాంకర్‌ రవి స్టైలే వేరు.

Advertisement
Bigg Boss Telugu 5 Anchor Ravi Birthday Celebration Outside Bigg Boss House Anch

ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై తన ప్రస్థానం కొనసాగిస్తున్న రవి ఈ మధ్యే బిగ్‌బాస్‌ సీజన్‌లోకి అడుగు పెట్టారు.చాకచక్యంగా గేమ్ ఆడుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

Bigg Boss Telugu 5 Anchor Ravi Birthday Celebration Outside Bigg Boss House Anch

రవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యామిలీతో పాటు అ ఆయన అభిమానులు కూడా బిగ్ బాస్ హౌజ్ బయట పటాసులు పేలుస్తూ రవికి వినబడేలా గట్టిగా అరుస్తూ బర్త్‌డే విషెస్‌ చెప్పినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో రవి కూతురు వియా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ బెలూన్లు గాల్లో వదిలి.అనంతరం తండ్రిని గుర్తు చేసుకుని ఏడుస్తుంది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.మరోపక్క యాంకర్‌ రవికి బిగ్‌బాస్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీ పంపిన లెటర్‌,ఇంకా ఒక గిఫ్ట్‌ను కూడా అతడికి అందించనున్నట్లు సమాచారం.ఇక హౌస్‌లో రవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చూడాలంటే మరో ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు