ఆ క్షణం ఆత్మహత్య చేసుకోవాలనిపించిందన్న నటి.. దుస్తులు తొలగించడంతో?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నటీమణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.

కొంతమంది నటీమణులు ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెబితే మరి కొందరు మాత్రం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెబుతారు.

నటి ఉర్ఫి జావేద్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సినిమా రంగంలో ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.బాలీవుడ్ సీరియల్స్ ద్వారా ఉర్ఫి పాపులారిటీని సంపాదించుకున్నారు.

బాదే భయ్యా కీ దుల్హనియా, మేరీ దర్గా నటిగా ఉర్ఫి జావేద్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.ప్రముఖ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న ఉర్ఫి తాజాగా ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఉర్ఫి తన కెరీర్ గురించి స్పందిస్తూ ఆఫర్లు రాకపోవడంతో తాను ఎంతో బాధ పడ్డానని వెల్లడించారు.

ఒక మహిళా నిర్మాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఉర్ఫి అన్నారు.ఆర్థికంగా స్థితిమంతులం కాకపోయినా సంప్రదాయబద్ధమైన ఫ్యామిలీలో తాను జన్మించానని ఉర్ఫి తెలిపారు.తనను బాగానే చదివించారని అయితే కొన్ని విషయాలలో తనకు ఆంక్షలు పెట్టేవారని ఉర్ఫి పేర్కొన్నారు.

Advertisement

నటి కావాలనే ఆలోచనతో ఇంటి నుంచి బయటకు వచ్చి 3000 రూపాయల ఉద్యోగంలో చేరానని ఆమె తెలిపారు.కొన్నిసార్లు తాను ఖాళీ కడుపుతో నిద్రపోయానని ఆఫర్ల కొరకు ఎంతోమందిని కలిశానని ఆమె వెల్లడించారు.

కొన్నిసార్లు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యేదని ఉర్ఫి అన్నారు.

ఒక వెబ్ సిరీస్ లో తనకు ఛాన్స్ దక్కిందని మహిళా నిర్మాత షూటింగ్ మొదలైన వెంటనే తన దుస్తులను తొలగించే ప్రయత్నం చేసిందని ఉర్ఫి వెల్లడించారు.తాను ఆ సీన్లు చేయనని చెబితే కాంట్రాక్ట్ పేపర్లు చూపించి మహిళా నిర్మాత తనను బెదిరించిందని ఉర్ఫి పేర్కొన్నారు.ఆ సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని ఉర్ఫి వెల్లడించారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు