నటరాజ్ మాస్టర్ చీప్ బిహేవియర్.. అషు రెడ్డిని చూస్తూ కంట్రోల్ కంట్రోల్ అంటూ?

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా యుద్ధవాతావరణం నెలకొంది.

టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ సైకోలుగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ నట్రాజ్ మాస్టర్ కూర్చొని హౌస్ లో కంటెస్టెంట్ లు గురించి ముచ్చట్లు పెట్టారు.ఈ క్రమంలోనే బాబా భాస్కర్ ఎన్ని బట్టలు తెచ్చుకున్నాడు ఇన్నాళ్లు ఉంటాడు అన్న విషయాల గురించి ఇద్దరు చర్చించుకుంటున్నారు.

ఇకపోతే బాబా భాస్కర్ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి అఖిల్ కాస్త డల్ అయిపోయాడు.ఈ క్రమంలోనే వారిద్దరూ మాట్లాడుకుంటూ బాబా భాస్కర్ ఈ వారం కాకపోయినా వచ్చే వారం అయినా వెళ్ళిపోతాడని, తనతో పాటు ఒక కంటెస్టెంట్ ని తీసుకుని మరీ పోతాడు అని ఆశలు పెట్టుకున్నారు అఖిల్, నట్రాజ్ మాస్టర్.

అలా మొత్తానికి బాబా భాస్కర్ అంతే అఖిల్ లో తెలియని వణుకు పుడుతోంది.అంతేకాకుండా ఒక రెండు వారాలు కనుక భాస్కర్ హౌస్ లో ఉన్నాడు అంటే అఖిల్ ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా కండిషన్ దెబ్బతినే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Advertisement
Bigg Boss Ott Fame Nataraj Master Praises Ashu Reddy Beautiness, Bigg Boss Non S

ఈ క్రమంలోనే అషు రెడ్డి చీర కట్టుకొని నడుము చూపించడంతో నట్రాజ్ మాస్టర్ నోటికి పని చెప్పాడు.అషు వైపు అలా చూస్తూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు.

Bigg Boss Ott Fame Nataraj Master Praises Ashu Reddy Beautiness, Bigg Boss Non S

అంతేకాకుండా ఇంకా ఏసి ఉన్నా సరే టెంపరేచర్ పెరిగిపోతుంది అంటూ మాటలతో రెచ్చిపోయాడు.ఎంత అందంగా ఉన్నావో.రోజు రోజుకి ఏంటిది అషు.? మాకు బిగ్ బాస్ హౌస్ లో ప్రతిరోజు జాగారాలు అంటూ అషు రెడ్డి అందాన్ని తెగ పొగిడేశాడు నట్రాజ్ మాస్టర్.అప్పుడు అషు అంత వద్దులే మాస్టర్ అని అనడంతో, ఒక వెంటనే నటరాజ్ మాస్టర్ లేదు నేను నిజం చెబుతున్నా ఎదురుగా ఉండి మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు అమ్మాయిలకు కనిపించరు.

తెలుసుకునే లోపు ఏమీ ఉండదు.ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ మాస్టర్ తన మాటల్లో డోస్ పెంచాడు.అంతటితో ఆగకుండా అషు రెడ్డి కిచెన్ లోకి వెళ్లిన కూడా అదే తరహాలో పొగుడుతూ వెళ్ళాడు.

మొత్తానికి నట్రాజ్ మాస్టర్ అషు అందాలను చూసి తనలో ఉన్న కాట్రాజు ని నిద్రలేపాడు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు