అరియనాను 'విశ్వాసం లేని కుక్క' అని తిట్టిన నటరాజ్ మాస్టర్.. ఆమె రెస్పాన్స్ ఏంటంటే?

బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే 11 వారాలు పూర్తి చేసుకుంది.

ఇకపోతే తాజాగా జరిగిన ఎలిమినేషన్స్ లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఓటింగ్ లో బాబా భాస్కర్, అనిల్, నటరాజ్ మాస్టర్ కు తక్కువ ఓట్లు రాగా అందులో తనకున్న పవర్ తో బాగా భాస్కర్ సేవ్ కాగా,ఇక అనిల్ నట్రాజ్ మాస్టర్ లు మిగిలారు.ఇక వీరిద్దరిలో ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా నట్రాజ్ మాస్టర్ ఎలిమెంట్ అయినట్లు బిగ్ బాస్ నాగార్జున తెలిపాడు.

అంతే కాకుండా నాగార్జున మరొక ట్విస్ట్ కూడా ఇచ్చాడు.ఇంటి సభ్యుల ఓటింగ్ ఏ విధంగా ఉన్నప్పటికీ జనాల ఓటింగ్ అయితే మాత్రం మాస్టర్ కి తక్కువ వచ్చాయని, ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే నట్రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టుగా అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు.

ఆ తర్వాత ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకు వచ్చిన నట్రాజ్ మాస్టర్ జర్నీ వీడియో చూసుకొని ఎమోషనల్ అయ్యాడు.అనంతరం హోస్ట్ నాగార్జున ఒక టాస్క్ ఇచ్చి రక రకాల జంతువులను చూపించి ఇంటి సభ్యుల్లో ఎవరు కరెక్టగా సూట్ అవుతారో చెప్పమని చెప్పాడు.

Bigg Boss Non Stop 11th Week Elimination Details Nataraj Master On Ariyana Glory
Advertisement
Bigg Boss Non Stop 11th Week Elimination Details Nataraj Master On Ariyana Glory

అఖిల్ ని గుర్రంతో పోల్చాడు.అనంతరం విశ్వాసం లేని కుక్క.అంటూ అరియానా మీద కామెంట్లు చేశాడు.

ఇంట్లో అందరి కంటే ఎక్కువగా నేను ఆమెను కేరింగ్‌గా చూసుకున్నాను.కానీ ఆమె మాత్రం నన్ను ఎప్పుడూ అలా అనుకోలేదు.

ప్రతీ విషయంలో నాకు వ్యతిరేకంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు నటరాజ్ మాస్టర్.ఆ తరువాత శివ ను తొండతో పోల్చాడు.

అందరినీ గెలకడం, నోటిదూల ఎక్కువగా ఉంటాయని నటరాజ్ మాస్టర్ అన్నాడు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు