ఆ ఇద్దరిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్.. జోస్యం చెప్పిన కౌశల్!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 మరో ఐదు వారాల్లో ముగియనుంది.

ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లు బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఈ సీజన్ లో విన్నర్ ఎవరవుతారో ప్రేక్షకులు సైతం ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు.

అభిజిత్, లాస్య , సోహైల్, అఖిల్ లలో ఎవరో ఒకరు విన్నర్ కావచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు.మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

Bigg Boss Kaushal Manda Reveals Abhijeet Or Sohel Bigg Boss Winner, Kaushal,abhi

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మండా సీజన్ 4లో అభిజిత్, సొహైల్ లలో ఎవరో ఒకరు విన్నర్ కావచ్చని చెబుతున్నారు.అభిజిత్ ఏ విషయం గురించైనా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాడని.

ఫిజికల్ టాస్కులలో సరిగ్గా పాల్గొనకపోయినా మైండ్ తో ఆడుతున్నాడని అన్నారు.అభిజిత్ ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటున్నాడని.

Advertisement

అలా వ్యూహాలను మార్చుకోవడం అతనికి ప్లస్ అవుతోందని కౌశల్ చెప్పారు.మరో కంటెస్టెంట్ సోహెల్ కూడా బాగా ఆడుతున్నాడని సోహెల్ ప్లస్, మైనస్ ఆవేశమేనని.

సోహెల్ ఆలోచనా తీరు భిన్నంగా ఉంటుందని.అభిజిత్, సోహెల్ లలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

సీజన్ 4లోని కంటెస్టంట్లలో అఖిల్ కూడా బాగానే ఆడుతున్నాడని అయితే మోనాల్ తో లవ్ ట్రాక్ అఖిల్ కు మైనస్ గా మారుతోందని అన్నారు.హారిక కొన్ని విషయాల్లో తన ప్రవర్తనను మార్చుకోవాలని.

కొంతమంది కంటెస్టంట్లతో హారిక ఎక్కువ సమయం ఉండటం ఆమెకు మైనస్ గా మారుతోందని చెప్పారు.అరియానా, అవినాష్ కూడా బాగానే ఆడుతున్నారని జాగ్రత్తగా ఆడితే టాప్ 5లో వాళ్లు నిలిచే అవకాశం ఉంటుందని కౌశల్ వెల్లడించారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

కౌశల్ అంచనా వేసిన వాళ్లే బిగ్ బాస్ విన్నర్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు