మెగా అల్లుడుకి చెల్లిగా మారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో సినిమాలలో అవకాశాలు పెంచుకుంటున్నారు.

బిగ్ బాస్ లో పాల్గొనడానికి ముందు చాలా మంది పేర్లు పెద్దగా ఎవరికీ తెలియదు.

అయితే సీజన్ నుంచి బయటకి వచ్చిన తర్వాత మాత్రం వారంతా ఒక్కసారిగా సెలబ్రిటీలుగా మారిపోయి టీవీ రియాలిటీ షోలలో సందడి చేస్తున్నారు.ఇద్దరు యంగ్ బ్యూటీస్ కి బిగ్ బాస్ ఈ సారి భాగా ఉపయోగపడింది.

వారు హీరోయిన్ గా ఎదగాలని అనుకుంటున్న దివి, అలాగే యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి యాక్టర్ అయ్యే పనిలో ఉన్న అరియానా.ఈ ముద్దుగుమ్మలు ఇద్దరూ టీవీషోలలో తెగ సందడి చేస్తున్నారు.

దేత్తడి హారిక కూడా బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలని భాగానే గ్రాస్ప్ చేస్తుంది.ఇక దివికి అయితే మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ గా ఆఫర్ ఇచ్చాడు.

Advertisement

వేదాలం రీమేక్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రకి కన్ఫర్మ్ చేసినట్లు తెలిపాడు.

మెగాస్టార్ ఆఫర్ పుణ్యమా అని ఇప్పుడు ఈ అమ్మడు కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేస్తుంది.ప్రస్తుతం హీరోయిన్ దివి రెండు, మూడు సినిమాలు సంతకం చేసినట్లు తెలుస్తుంది.ఇక అరియానా ఇప్పటికే నటిగా ఎంట్రీ ఇచ్చింది.

శ్రీనివాస్ గావిరెడ్డి, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈ అమ్మడు నటిస్తుంది.అయితే ఇందులో ఆమె ఏ పాత్రలో కనిపిస్తుంది అనేది క్లారిటీ లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ అల్లుడు హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమాలో అరియానాకి ఆఫర్ వచ్చింది.రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కి చెల్లిగా అరియానా కనిపించాబోతుందని తెలుస్తుంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు