తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారం అవుతుంది.ఇప్పటికే ఏడువారాలను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 8వ వారం కొనసాగుతోంది.
ఇకపోతే ఏడవ వారంలో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి అర్జున్ ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన అర్జున్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శ్రీ సత్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ…తాను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే సమయంలో కాస్త ఎమోషనల్ అయ్యాను.అదేవిధంగా శ్రీ సత్య కూడా ఎమోషనల్ అయింది.
ఈ క్రమంలోనే మా ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అదేవిధంగా చాలామంది నేను శ్రీ సత్య కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చానని భావిస్తున్నారంటూ అర్జున్ కళ్యాణ్ తెలిపారు.
నిజానికి తనకు సినిమాలంటే ఎంతో ఇష్టం.సినిమాలలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను.

ఇలా నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో శ్రీ సత్య తాను బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్నానని చెప్పారు.బిగ్ బాస్ వెళ్లడం వల్ల మరికొంత ఫేమ్ వస్తుందని, ఎక్కువ రీచ్ ఉంటుందని భావించిన తాను కూడా బిగ్ బాస్ ట్రై చేశానని తెలిపారు.ఈ విధంగా శ్రీ సత్య వల్ల తాను బిగ్ బాస్ హౌస్ కి వచ్చానని చెప్పానే కానీ చాలామంది శ్రీ సత్య కోసమే తాను బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా అర్జున్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తనకు అక్కడ పరిస్థితులకు అడ్జస్ట్ కావడానికి కొంత సమయం పట్టింది.
ఇక అంత ఓకే అనుకున్న సమయంలోనే తాను బయటికి వచ్చాను అంటూ అర్జున్ తెలియజేశారు.