రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుస ప్లాప్స్ వచ్చినా క్రేజ్ తగ్గలేదు.ఇక ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇతడికి ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.
పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది.కానీ డిజాస్టర్ అవ్వడంతో రౌడీ కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యాడు.
ఇక ఇప్పుడు మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
లైగర్ సినిమా రిలీజ్ కంటే ముందే విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమణ సినిమాను ప్రకటించారు.
కానీ ఈ సినిమా లైగర్ ప్లాప్ కారణంగా ఆగిపోయింది.ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగిపోవడంతో ఇప్పుడు విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు విజయ్.
ప్రెజెంట్ విజయ్ తన ద్రుష్టి మొత్తం ఈ సినిమా మీదనే పెట్టాడు.
ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ఆ తర్వాత చాలా రోజుల నుండి వాయిదా పడుతూనే ఉంది.లైగర్ సినిమా ప్రొమోషన్స్ కారణంగా విజయ్, యశోద షూటింగ్ బిజీలో సామ్ ఉండడం వల్ల ఈ సినిమా వాయిదా పడింది.
అయితే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఇప్పుడు సన్నద్ధం అవుతున్నారట.నవంబర్ 15 నుండి ఈ సినిమా షూట్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో 15 నుండి షూట్ స్టార్ట్ చేయనున్నారట.ఈ లోపు ప్రొమోషన్స్ లో సామ్ బిజీగా ఉండనుంది.కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథగా ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా మీదనే ఇటు విజయ్, సమంత, అటు శివ నిర్వాణ ఆశలు పెట్టుకున్నారు.మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.