బిగ్ బాస్ షో ద్వారా నైనిక ఎన్ని లక్షలు సంపాదించిందో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8( Bigg Boss Telugu Season 8 ) అప్పుడే 5 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు.తాజాగా సండే ఫండే సరదా సరదాగా సాగింది.

ప్రతి వారం లాగే ఈ వీకెండ్ హౌస్ లో నుంచి ఒకరు ఎలిమినేట్ కాగా నలుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు.వీకెండ్ లో పొట్టి పిల్ల, ఢీ ఫేమ్ నైనిక ఎలిమినేట్ అయ్యింది.

షో ప్రారంభంలో నైనిక ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించింది.

Advertisement

టాస్కుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది.ముఖ్యంగా క్లాన్‌ లీడర్‌గా ఎదిగేందుకు నైనిక( Ninika ) ఆడిన గేమ్ బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది.హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ గా కనిపించిన నైనిక అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆ తర్వాత ఎందుకో పూర్తిగా స్లో అయిపోయింది.క్లాన్‌ చీఫ్‌గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.ఆటలోనూ నిరుత్సాహపరిచింది.

స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్కులు, గేమ్స్ లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనలేకపోయింది.నైనిక ఆట తీరును చూసి నాగార్జున( Nagarjuna ) ఆశ్చర్యపోయాడు.

నైనిక నీ గేమ్‌ ఎటు పోయింది? నీలో ఫైర్‌ ఏమైపోయింది అని ఆమె ముఖం మీదే అడగడం నైనిక ఆట తీరుకు అద్దం పడుతుంది.

ఏంటి హార్దిక్ అంత సింపుల్ గా ఆడేసావ్.. 'నో లుక్ షాట్' వైరల్
చైతన్యలో ఆ లక్షణాలు అంటే ఇష్టమంటున్న శోభిత.. హుందాగా ప్రవర్తిస్తాడంటూ?

ఈ క్రమంలోనే ఐదో వారం నామినేషన్స్ లో నిలిచింది నైనిక.ఆడియెన్స్ కూడా ఆమెను హౌస్‌లో ఉంచాల్సిన అవసరం లేదనుకున్నారు.ఫలితంగా ఓటింగ్ లో తక్కువ ఓట్లు పడ్డాయి.

Advertisement

ఫలితంగా చాలా మంది ఊహించినట్లే నైనిక ఎలిమినేట్ అయ్యింది.ఇకపోతే మరి ఈ ఐదు వారాలకు గాను నైనిక ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది అన్న విషయానికి వస్తే.వారానికి రూ.2.20 లక్షల లెక్కన మొత్తం ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకుందట నైనిక.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు